గ్యాలరి

Star Maa Logo lLaunch Images
Om Namo Venkatesya Movie Press Meet
Lakshmi bomb movie stills
Nani Latest Stills

సినిమా

గాసిప్స్

నిత్య మీనన్ సినిమాలకు గుడ్ బాయ్ చెబుతుందా..?!

నిత్య మీనన్ సినిమాలకు గుడ్ బాయ్ చెబుతుందా..?!

తెలుగు ఇండస్ట్రీలో ‘అలా మొదలైంది’ చిత్రంతో హీరో నానీ సరసన నటించింది మళియాల ముద్దుగుమ్మ నిత్యామీనన్. బొద్దుగా ముద్దగా ఉండే నిత్యా మీనన్ బాలనటిగా నటించి తర్వాత హీరోయిన్ అయ్యింది. More

క్రీడలు

క్రికెట్‌లో ‘చైనామ్యాన్’ బౌలర్ అనే పదం ఎలా పుట్టిందో తెలుసా?

క్రికెట్‌లో ‘చైనామ్యాన్’ బౌలర్ అనే పదం ఎలా పుట్టిందో తెలుసా?

ధర్మశాల: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖటి టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అయితే అతని బౌలింగ్ తీరులో పెద్ద విశేషముంది. అతను ఎడమచేత్తో లెగ్ స్పిన్ వేస్తాడు. ఇలాంటి బౌలర్లు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు చాలా తక్కువ మంది(28) మాత్రమే ఉన్నారు. అయితే భారత్ తరుపున ఆ విధమైన మొట్టమొదటి బౌలర్ కుల్దీప్ యాదవ్ మాత్రమే. ఇలాంటి బౌలర్లను లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్లని అంటారు. స్లో లెఫ్ట్ ఆర్మ్ ‘చైనామ్యాన్’ బౌలర్లని అని కూడా అంటారు. అయితే ఈ ‘చైనామ్యాన్’ అనే పదం ఎలా పుట్టిందనేది ఆసక్తికరమైన అంశం. 1933లో ఆతిద్య జట్టు ఇంగ్లండ్, పర్యాటక జట్టు వెస్టిండీస్‌కు మధ్య ఒక టెస్ట్ మ్యాచ్ జరిగింది.

మొదటి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 375 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ టాప్ ఆర్డర్‌ను విండీస్ పేసర్ మన్నీ మార్టిన్‌డేల్ పెవీలియన్ బాట పట్టించాడు. కానీ ఏడో వికెట్‌కు ఇంగ్లండ్ కెప్టెన్ డగ్లస్ జర్డైన్, వాల్టర్ రాబిన్స్ 140 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ సమయంలో సెంచరీకి దగ్గరగా ఉన్న రాబిన్స్‌ను విండస్ బౌలర్ ఎల్లిస్ అచోంగ్ అద్భుతమైన బంతితో స్టంపౌట్ అయ్యేలా చేశాడు.

దీంతో రాబిన్స్ పెవీలియన్‌కు వెళుతూ బ్లడీ ‘చైనామ్యాన్’ వెరైటీ బంతి వేశాడని తిట్టుకుంటూ వెళ్లాడట. వెస్టిండీస్ తరుపున ఆడిన బౌలర్ ఎల్లిస్ అచోంగ్ క్రికెట్‌లో మొదటి చైనా ఆటగాడు. దీంతో అప్పటి నుంచి ఇలా ఎడమచేత్తో లెగ్ స్పిన్ వేస్తున్న బౌలర్లను ‘చైనామ్యాన్’ బౌలర్లని పిలుస్తున్నారు.

గ్యాలరి

హీరోలు

Nani Latest Stills

విందులు

Star Maa Logo lLaunch Images

సినిమా

Lakshmi bomb movie stills

సినిమా ప్రదేశములు

namo venkatesaya shooting location images

హీరొయిన్స్

Deepika Padukone Images