అమరేంద్ర బాహుబలితో దేవసేన వచ్చింది

అమరేంద్ర బాహుబలితో దేవసేన వచ్చింది

హైదరాబాద్‌: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని

‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ చిత్ర బృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. అమరేంద్ర బాహుబలి(ప్రభాస్‌)తో దేవసేన(అనుష్క) ఉన్న స్టిల్‌ను పంచుకుంది. ‘బాహుబలి: ది బిగినింగ్‌’లో దేవసేన పాత్రలో డీ గ్లామర్‌గా కనిపించిన అనుష్క ఈ పోస్టర్‌లో చాలా అందంగా కనిపించారు. అమరేంద్ర బాహుబలితో కలిసి దేవసేన బాణం గురిచూస్తున్న పోజు ఆకట్టుకుంటోంది.

ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన ‘బాహుబలి: ది బిగినింగ్‌’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని మరింత పెంచింది.

ప్రభాస్‌, అనుష్కతోపాటు రానా, తమన్నా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కొనసాగింపుగా రూపొందుతున్న ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ చిత్రం ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రం కోసం సినీ ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.