ఆ యాంకర్ కు నిశ్చితార్థమా…

ఆ యాంకర్ కు నిశ్చితార్థమా…

బుల్లితెర ఫై తనదయిన యాంకరింగ్ తో అలరిస్తూ వస్తున్న లాస్య..కొన్ని నెలలుగా కనిపించడం మానేసింది..ఒకప్పుడు టీవీ ఆన్ చేస్తే చాలు లస్యే కనిపించేది..కేవలం టీవీ షో లలోనే కాకుండా ఆడియో ఫంక్షన్స్ , సినిమా ఈవెంట్ లలో కూడా తన యాంకరింగ్ తో సత్తా చాటిన లాస్య , సడెన్ గా బుల్లి తెర ఫై కనిపించడం మానేసింది..ఏంటా అని ఆరా తీసే లోపు అమ్మడు , వెండి తెర ఫై కుమ్మడానికి రెడీ అయ్యిందని అధికారిక ప్రకటన వచ్చింది తాజాగా ‘రాజా మీరు కేక’ అంటూ ఓ సినిమా లో హీరోయిన్ గా నటిస్తున్నట్లు అధికారిక అనౌన్స్ మెంట్ తో పాటు ఫస్ట్ లుక్ ఇచ్చేసింది..

ఇలాంటి ఆఫర్స్ వస్తున్నప్పుడు ఎవరు కూడా పెళ్లి జోలికి వెళ్లారు..కనీసం దాని గురించి కూడా ఆలోచించారు..కానీ లాస్య మాత్రం రివర్స్ గా పెళ్లి ప్రస్తావన చెప్పి షాక్ ఇచ్చింది.

‘ఓ ప్రత్యేకమైన రోజు కోసం సిద్ధమవుతుండడం ఎంతో ఆనందంగా ఉంది. నా సోల్ మేట్ తో ఎంగేజ్మెంట్ కి రెడీ అవుతున్నా. ఎంతో ఎగ్జైటింగ్ గా ఉంది’ అంటూ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు చెప్పింది లాస్య.

ఇంతకీ లాస్యను చేసుకోబోతోన్న ఆ వ్యక్తి ఎవరో మాత్రం లాస్య చెప్పలేదు. ఈ ఎంగేజ్మెంట్ కబుర్లు అన్నీ రియల్ లైఫ్ గురించి చెబుతోందా లేక రీల్ లైఫ్ లో ఎంగేజ్మెంట్ గురించా అనే విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. కొన్ని రోజులు వెయిట్ చేస్తే గాని అసలు వ్యక్తి బయటపడడు.