వేసవిలో తలలో చెమట, తల దురదను తగ్గించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్

వేసవిలో తలలో చెమట, తల దురదను తగ్గించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్

అలర్జీ… ఈ పదాన్ని గురించి దాదాపు అందరూ వినే ఉంటారు. వాతావరణ కాలుష్యం వల్ల, శరీరానికి సరిపడని పదార్థాలు, అతిగా మందులు వాడటం, ఎక్కువసేపు నీటిలో నానడం, కలుషితమైన నిల్వ ఆహారం లేదా ఇతర కారణాల వల్ల ఈ అలెర్జీ తలెత్తుతుంది. అంటే… పొగ, దుమ్ము, ఇవే కాకుండా మనం తినే ఆహారం వల్ల కూడా అలర్జీ వస్తుంది. దీన్నే ‘ఫుడ్ అలర్జీ’ అంటాము. కొంతమందికి వారివారి శరీర తత్వానికి కొన్ని ఆహార పదార్థాలు సరిపడవు. ఇలా శరీరానికి పడని వాటిని తిన్న అరగంటలోపే మార్పులు కనిపిస్తాయి. కొంతమందికి గుడ్డు, మాంసం పడదు. ఇంకొందరికీ చేపలు పడవు. అలర్జీ అనేది కేవలం శరీరంపై దద్దుర్ల రూపేణా మాత్రమే వస్తుందనుకోరాదు. తలలో కూడా వస్తుంది. తల దురదకు కేవలం పేలు, డ్యాండ్రఫ్ మాత్రమే కారణం అనుకోరాదు. అలర్జీ కూడా కారణమే. తల దురద వచ్చిందంటే ఆ బాధ చెప్పలేము. బాస్‌తో, సహోద్యోగులతో, స్నేహితులతోనో మాట్లాడే సమయంలో లేదా ఏమయినా ముఖ్యమైన పనులలో ఉన్నప్పుడు తల దురద పెడితే కలిగే చికాకు ఇంతా అంతా కాదు. తలలో దురద వచ్చిందనుకోండి! ఏం చేస్తాం! గోళ్లతో గోకి తాత్కాలికంగా సాంత్వన పొందుతాం.అలా గోకడం వల్ల తల మాడు ఎర్రబడం, పుండ్లుగా తయారవడం, ఇన్ఫెక్షన్ సోకడం వంటి వాటితో మొదలై దురుదకు దారి తీస్తుంది.

అయితే ఈ దురద వల్ల జుట్టుకు అనేక విధాలుగా సమస్యలు ఏర్పడుతాయి. తల దురదు ఇన్ఫెక్షన్ కూడా ఒక ప్రాధాణ కారణం అని మీరు తెలుసుకోవాలి. దురద లేదా చుండ్రు ఏదైనా సరే అది ఇన్ఫెక్షన్ వల్లే కలిగి ఉంటుంది. తల పొడిబారటం కూడా దురదకు ఒక కారణం కావచ్చు. ఈ హెయిర్ సమస్యను పూర్తిగా తొలగించుకోవడానికి కొన్ని హోం రెమడీస్ ఉన్నాయి. అందుకు కాస్త ఓపికగా ప్రయత్నించడం వల్ల తిరిగి ఎప్పటికీ రాకుండా జుట్టును రక్షించుకోవచ్చు. తల దురదును నివారించడానికి క్రింద కొన్ని హోం రెమడీస్ ఉన్నాయి . ఈ సమస్యను ఆలస్యం చేసి మరిన్ని జుట్టు సమస్యలకు దారితీసేవరకూ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఈ పరిష్కార మార్గంను ఫాలో అవ్వండి. మంచి ఫలితాలను పొందండి…

టీట్రీ ఆయిల్ : టీ ట్రీ ఆయిల్లో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇది తలలో ఇన్ఫెక్షన్ తో పాటు, అన్ని రకాల జుట్టు సమస్యలను నివారిస్తుంది. ముఖ్యంగా తలలో దురద తగ్గిస్తుంది. ఒక టీస్పూన్ టీట్రీ ఆయిల్ తీసుకుని, షాంపు మిక్స్ చేసి, పెట్టుకోవాలి. టీట్రీ ఆయిల్ ను నేరుగా అప్లై చేయకూడదు. ఈ కాంబినేసన్ లో తలకు అప్లై చేసి 15 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. టీ ట్రీ ఆయిల్ ను కంటిన్యుగా అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

బేకింగ్ సోడ: మీకేశాల మందం, పొడవును బట్టి సరిపడా బేకింగ్ సోడా తీసుకోవాలి. ఈ బేకింగ్ సోడాను కొద్దిగా నీళ్ళలో కలిపి జుట్టుకు పట్టించి తర్వాత తలస్నానం చేయాలి. ఈ బేకింగ్ సోడా చిట్కా ఇంట్లో ప్రయత్నించడం చాలా సులభం. ఒక బౌల్లో 5 స్పూన్ల బేకింగ్ సోడా తీసుకుని, కొద్దిగా నీరు మిక్స్ చేసి, మెత్తగా పేస్ట్ చేయాలి. తర్వాత ఈ పేస్ట్ ను తలకు నేరుగా పట్టించాలి. 20 నిముషాల తర్వాత తలస్నానం చేసుకోవాలి. తలలో దురదను ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది.
లెమన్ జ్యూస్ : జుట్టుకు అనేక పోషక విలువలను అంధించే విటమిన్లు మరియు సిట్రస్ యాసిడ్ పుష్కలంగా ఉండి జుట్టు సమస్యలకు మంచి ప్రయోజనం కలిగిస్తుంది. కాబట్టి తలలో దురదగా ఉన్నట్లైతే , తాజాగా ఉండే నిమ్మకాయను కట్ చేసి తలలో మర్ధన చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. షాంపును వాడకుండా తలస్నానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కేశాలు మంచి సువాసన కలిగి ఉంటాయి.

కొబ్బరి నూనె: గోరువెచ్చని కొబ్బరి నూనె, అనేక జుట్టు సమస్యలను నివారంచడాని అద్బుతంగా సహాయపడుతుంది. దురద పెట్టే తలకు ఈ హాట్ ఆయిల్ మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి తలకు పట్టించి తర్వాత తలస్నానం చేయాలి. తలదురదను తగ్గించడంలో బెస్ట్ రెమెడీగా చెబుతారు. రెండు మూడు చుక్కల కొబ్బరి నూనెను, షాంపుతో మిక్స్ చేసి తలకు అప్లై చేసి తలస్నానం చేయాలి. అలాగే రోజువిడిచి రోజు తలకు కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం వల్ల తలలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్న తొలగిపోతుంది. ఫంగల్ మరియు యాంటీబ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తొలగిపోతాయి .

యాపిల్ సైడర్ వెనిగర్ : యాపిల్ సైడర్ వెనిగర్ ను నీళ్లలో మిక్స్ చేసి, హెయిర్ స్ప్రేలాగే ఉపయోగిస్తే తల దురద తగ్గుతుంది. కొద్దిగా ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఒక స్ప్రేబాటిల్లో వేయాలి. మిగిలన సగ భాగం వాటర్ మిక్స్ చేసి, కొద్దిసేపు అలాగే ఉంచడాలి. ప్రతి రోజూ తలస్నానానికి ముందు ఈ హెయిర్ స్ప్రే చేసి 20 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి . ఈ చిట్కాతో చుండ్రు తగ్గుతుంది. జుట్టు మొదళ్లును స్ట్రాంగ్ గా మార్చుతుంది.

నువ్వుల నూనె: నువ్వుల నూనెలో హీలింగ్, లూబ్రికేంట్స్ క్వాలిటీస్ వల్ల తలలోదురదను తగ్గిస్తుంది. ఒక బౌల్లో నువ్వుల నూనె తీసుకుని, వేడి చేయాలి. దీన్ని తలకు అప్లై చేసి 20 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. ముఖ్యంగా దీన్ని రాత్రుల్లో అప్లై చేసి ఉదయం తలస్నానం చేస్తే ఫలితం మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది. దాంతో తలలో దురద తగ్గుతుంది.

మెంతులు: మెంతులను మెత్తని పౌడర్ లా తయారు చేసి, అందులో రోజ్మెరీ ఆయిల్ మిక్స్ చేసి, పల్చగా, లిక్విడ్ గా తయారు చేసుకోవాలి . ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి . తర్వాత షవర్ క్యాప్ తో తలను పూర్తిగా కవర్ చేసి, అరగంట నుండి ఒక గంట వరకూ అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేసుకోవాలి.

పెరుగు: పెరుగును గుడ్డులోని తెల్లసొనతో మిక్స్ చేసి, తలకు పట్టించిడం వల్ల మంచి ప్రయోజనం కలిగిస్తుంది. ఈ హెయిర్ ప్యాక్ దురదగా ఉండే జుట్టు సమస్యను నివారిస్తుంది. ఈ హెయిర్ ప్యాక్ ను రెండు వారాలకొక్కసారైనా అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.