షాకింగ్ న్యూస్…ఎన్టీఆర్‌కు ఐటీ నోటీసులు

షాకింగ్ న్యూస్…ఎన్టీఆర్‌కు ఐటీ నోటీసులు

విదేశాల్లో చేసిన సినిమాలను సేవల ఎగుమతుల కింద చూపుతూ హీరోలు సర్వీస్‌ ట్యాక్స్‌ ఎగవేస్తున్నారని కాగ్‌ ఆక్షేపించింది. ఇందులోభాగంగా ‘నాన్నకు ప్రేమతో’ మూవీలో నటించినందుకు ఎన్టీఆర్‌కి, లండన్‌కు చెందిన వైబ్రంట్ విజువల్ ప్రొడ్యూసింగ్ కంపెనీ నుంచి 2015లో ఏడున్నర కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. తన సేవలను ఎగుమతి చేస్తున్నట్లు చెప్పి ఎన్టీఆర్ రూ.1.10 కోట్ల సర్వీసు ట్యాక్స్‌ మినహాయింపునకు క్లెయిమ్‌ చేసినట్లు తేలింది. ఎన్టీఆర్‌ విషయంలో కాగ్ లేవనెత్తిన అభ్యంతరాన్ని ఆర్థిక మంత్రిత్వశాఖ పరిగణనలోకి తీసుకొని రూ.1.10 కోట్ల పన్ను మినహాయింపునకు సంబంధించి నోటీసు జారీ చేసినట్లు వెల్లడించింది. అలాంటి కేసులు ఇంకా ఏమైనా ఉన్నాయేమో పరిశీలించాలని సంబంధిత సర్కిల్‌ అధికారులను ఆదేశించినట్లు తెలిపింది.

మరోవైపు బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌కపూర్‌ కూడా ‘ఆయే దిల్‌హై ముస్కిల్‌’ మూవీకి తీసుకున్న రెమ్యునరేషన్‌కు ఇలాంటి 
మినహాయింపు పొందాడు. అందులో నటించినందుకు రూ.6.75 కోట్లను లండన్‌ కేంద్రంగా పని చేసే ఏడీహెచ్‌ఎం ఫిలిమ్స్‌ 
లిమిటెడ్‌ ద్వారా రణ్‌బీర్ పొందినట్లు తెలిపింది. విదేశాల్లో షూటింగ్‌ చేసుకున్నందున తన సేవలను ఎగుమతి చేసినట్లు చెప్పి 
ఆయన రూ.83.43 లక్షల సర్వీసు పన్ను చెల్లించలేదని కాగ్‌ పేర్కొంది. ఆ ప్రాజెక్ట్‌ను ధర్మ ప్రొడక్షన్‌.. భారత్‌, న్యూయార్క్‌లో 
నిర్మించినట్లు కాగ్‌ పేర్కొంది. రణ్‌బీర్‌కపూర్‌ విషయంలో సంబంధిత మంత్రిత్వశాఖ వివరణ ఇస్తూ ఒకటికి మించిన 
లొకేషన్లలో నటుడు సేవలు అందించాడని, ఎక్కువ భాగం విదేశాల్లో షూటింగులు జరిగినప్పుడు, రకరకాల లొకేషన్స్‌లో 
చేసినప్పుడు ఆ సేవలు పన్ను పరిధిలోకి రావని తేల్చి చెప్పేసింది. వినోద రంగంలో సేవా పన్నుల చెల్లింపుల్లో జరిగిన 
అవకతవకలపై కాగ్ అధ్యయనం చేసి రెడీ చేసిన నివేదికను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘవాల్‌ 
శుక్రవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన విషయం తెల్సిందే!