నేటి నుంచి నంద్యాలలో జగన్‌ పర్యటన

నేటి నుంచి నంద్యాలలో జగన్‌ పర్యటన

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నంద్యాల ఉప ఎన్నిక ప్రచారానికి నేటి (బుధవారం) నుంచి శ్రీకారం చుడుతున్నారు. మొదటి విడతలో మూడురోజుల (9, 10, 11 తేదీల్లో) పాటు ఆయన ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ తలశిల రఘురాం చెప్పారు.

బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు నంద్యాల మండలం రైతునగరంలో ప్రచారానికి శ్రీకారం చుడతారని వెల్లడించారు. అక్కడి నుంచి రామకృష్ణానగర్, కానాల, హైస్కూల్‌ కొట్టాల, అనంతరం గోస్పాడు మండలంలోని ఎం.చింతకుంట్ల, జూలేపల్లి, పసురపాడు, తేళ్లపురి గ్రామాల్లో రోడ్‌షో నిర్వహిస్తారని వివరించారు.