పొట్ట తగ్గించేందుకు రెండు సింపుల్ చిట్కాలు

పొట్ట తగ్గించేందుకు రెండు సింపుల్ చిట్కాలు

ప్రస్తుతం మోడ్రన్ టెక్నాలజీ యుగంలో మనుష్యుల జీవనం తీరు మారిపోయింది. కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం, జంక్ ఫుడ్ తీసుకోవడం, పోషకాహారానికి దూరమవడంతో మూడు పదులు నిండకుండానే ఆడా, మగా తేడాలేకుండా అందరికి బొజ్జ పెరిగిపోతుంది. కాస్త వయస్సు మీరాక బొజ్జ వస్తే ఓకే..మరీ దారుణంగా మూడు పదుల లోపు వయస్సు ఉన్న వాళ్లకే బొజ్జ బాగా పెరిగిపోతోంది. ఇది అనేక రకాల సమస్యలతో పాటు అనారోగ్యానికి కూడా కారణమవుతోంది.

బొజ్జకు మనం ఇంట్లోనే జ్యూస్ చేసుకుని తాగితే సరిపోతుంది. ఈ సింపుల్ చిట్కా బొజ్జను తగ్గించేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. మామూలుగా అయితే కడుపులో పేరుకుపోయిన కొవ్వును కరిగించడం అంత సులభం కాదు. పొత్తి కడుపులో కొవ్వు పేరుకుపోతే.. దాన్ని కరిగించేందుకు ఆహారంలో మార్పులు చేసుకోవాలి. వ్యాయామం చేయాలి. శరీరాన్ని బాగా అలసట పెడితే తప్ప ఈ కొవ్వు కరగదు.

జ్యూస్‌కు కావాల్సిన పదార్థాలు :అయితే పొట్ట తగ్గించేందుకు ఇంట్లో జ్యూస్ రెడీ చేసుకునేందుకు ముందుగా ఈ పదార్థాలు రెడీ చేసుకోవాలి. కీరదోస -1 , నిమ్మ కాయ – 1 , పుదీనా ఆకులు అర కప్పు, అల్లం తురుము రెండు స్పూన్లు, తగినంత నీరు రెడీ చేసుకోవాలి.

తయారీ విధానం: కీరదోసను శుభ్రం చేసుకుని.. తొక్కను తీసేసి మిక్సీలో రుబ్బుకోవాలి. ఇందులో నిమ్మరసం పిండాలి. ఆ తర్వాత పుదీనా తురుము, అల్లం తరుగు చేర్చుకుని తగినన్ని నీటితో జ్యూస్‌లా తయారు చేసుకోవాలి. రోజూ ఉదయం పూట ఈరసాన్ని తాగితే మూడు నెలల్లోపు పొట్ట తగ్గిపోతుంది.

అలాగే మరో చిట్కా ఏంటంటే ఓ గ్లాసుడు వేడి నీటిలో ఒక నిమ్మకాయ రసం, తేనె, రెండు వెల్లుల్లి రేకుల పొడిని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ఉదయం పూట తీసుకుంటే సులభంగా బరువు తగ్గుపోవచ్చు. ఇది ఇంకా సింపుల్ చిట్కా.

Related Images: