బిగ్ బాస్ రెండో సీజన్ కంటెస్టంట్స్, హోస్ట్ వీళ్లేనా..?

బిగ్ బాస్ రెండో సీజన్ కంటెస్టంట్స్, హోస్ట్ వీళ్లేనా..?

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్ సూపర్ సక్సెస్ అయ్యింది. హౌజ్ మెట్స్ గా ఎవరెవరినో తీసుకున్నా హౌజ్ నుండి బయటకు వచ్చేప్పుడు మాత్రం వారు సెలబ్రిటీస్ గానే వచ్చారు. బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ విన్నర్ గా శివబాలాజికి వచ్చిన క్రేజ్ తెలిసిందే. ఇక ఇదే క్రమంలో మరింత లేట్ చేయకుండా బిగ్ బాస్ సీజన్ 2ని స్టార్ట్ చేయబోతున్నారట.

బిగ్ బాస్ సీజన్ 2కి ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. చేయబోయే త్రివిక్రం సినిమా కోసం ఎన్.టి.ఆర్ స్పెషల్ లుక్ ట్రై చేస్తున్నాడట ఈ లుక్ రివీల్ అవ్వకూదడని త్రివిక్రం అనుకున్నాడట. అందుకే బిగ్ బాస్ సీజన్-2కి ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేయకపోవచ్చని అంటున్నారు.

ఇక ఎన్.టి.ఆర్ ప్లేస్ లో నాని బిగ్ బాస్ సెకండ్ సీజన్ హోస్ట్ గా ఉంటాడని తెలుస్తుంది. ఇక కంటెస్టంట్స్ గా కూడా ఓ లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక వారెవరు అంటే.. వరుణ్ సందేష్, కమెడియన్ వేణు, తనీష్, హర్ష, చాందిని చౌదరి, లాస్య, గీతా మాధురి, గజాలా, ఆర్యన్ రాజేష్, ధన్యా బాలకృష్ణన్ ఇలా మెయిన్ హౌజ్ మెట్స్ గా సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారట.

ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీలో తరుణ్, చార్మిలు వస్తారని అంటున్నారు. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న లిస్ట్ అవునో కాదో తెలియదు కాని బిగ్ బాస్ సీజన్ 1 తర్వాత బిగ్ బాస్ లో ఉండేందుకు సెలబ్రిటీస్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. మరి బయటకు వచ్చిన ఈ లిస్ట్ లో బిగ్ బాస్-2లో ఉండేది ఎవరో చూడాలి.

బిగ్ బాస్ హోస్ట్ గా నాని

‘బిగ్ బాస్’ షో ఆ ఛానల్ కి ఎంత ప్లస్ అయిందన్న లెక్క అటుంచితే.. తెలుగు టీవీ ఇండస్ట్రీలో ఇదొక మైల్ స్టోన్ అన్న మాటైతే నిజం. ఈ టెంపోని ఇదే విధంగా కంటిన్యూ చేయాలని భావిస్తోంది స్టార్ మా. సీజన్-2 కోసం కసరత్తు కూడా సైలెంట్ గా మొదలైనట్లు తెలుస్తోంది. సినిమాలతో పాటు, పాలిటిక్స్ తో కూడా తారక్ బిజీగా మారతాడన్న అంచనాల నేపథ్యంలో మరొక హోస్ట్ కోసం నిర్వాహకులు వెతుకుతున్నారని, హీరో నాని పేరును గట్టిగా పరిశీలిస్తున్నారని అప్పుడే వార్తలొచ్చేస్తున్నాయి.

ఈ వార్తలో నిజమెంత.. ఈ ప్రక్రియ ఎంతవరకొచ్చింది.. అన్నది తేలకముందే.. ఈ మేరకు సంతకాలు కూడా అయిపోయాయన్న రీసౌండ్ ఫిలిం నగర్ లో వినిపిస్తోంది. న్యాచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నాని.. బిగ్ బాస్ హోస్ట్ గా తారక్ ని మరిపిస్తాడన్న ఆశాభావం కూడా వ్యక్తమవుతోంది. సీజన్2 పార్టిసిపెంట్ల పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. కానీ.. సీజన్1 కి ముందు ఇటువంటి వార్తలు వందలకొద్దీ వచ్చినా. ఏదీ నిజం కాలేదు.