కోహ్లీ జట్టుని చూసి స్మిత్ సేన భయపడింది….!

కోహ్లీ జట్టుని చూసి స్మిత్ సేన భయపడింది….!

హైదరాబాద్: ఆస్ట్రేలియా క్రికెట్ ప్రపంచంలోనే అత్యుత్తమ జట్లలో ఒకటి. ఒకప్పుడు ఆస్ట్రేలియా జట్టుని చూస్తే ప్రపంచంలో ఏ జట్టుకైనా ఓటమి భయం ఉండేది. కానీ అలాంటి ఆసీస్ జట్టు ఇప్పుడు విరాట్ కోహ్లీ జట్టుని భయపడుతోందంట.ఈ మాట అన్నది ఎవరో కాదు. ఆ జట్టు కోచ్ డేవిడ్ సాకేర్.

నాగ్ పూర్ వేదికగా ఆదివారం ఐదో వన్డే ముగిసిన తర్వాత కోచ్ డేవిడ్ సాకేర్ మీడియాతో మాట్లాడుతూ ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా సొంతగడ్డపై కోహ్లీ సేనను ఎదుర్కోవడానికి భయపడే ఆసీస్ ఓడిపోయిందని చెప్పాడు. వన్డే సిరిస్ ఓటమి ఆసీస్ ఆటగాళ్ల మనోస్థైర్యాన్ని దారుణంగా దెబ్బతీసిందని ఆయన అన్నారు.

శనివారం నుంచి ఇరు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ 
గట్టి పోటీ ఇస్తామని కోచ్ ధీమా

శనివారం నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరిస్‌లోనైనా భారత్‌కు గట్టి పోటీ ఇస్తామని కోచ్ ధీమా వ్యక్తం చేశాడు. ‘జట్టులో చాలా మంది భయపడుతూ ఆడుతున్నారు. దానిని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నాం. నిజానికి ఆరంభంలో మేము స్వేచ్ఛగా క్రికెట్ ఆడాలని అనుకున్నాం. కానీ.. వరుసగా ఓటములు ఎదురయ్యే సరికి మా జట్టు క్రికెటర్లపై ఒత్తిడి పెరిగిపోయింది’ అని అన్నాడు.

ప్రస్తుతం ఆటగాళ్ల మైండ్‌సెట్ పరంగా తీసుకుంటే 
వరుసగా ఓడిపోతున్నప్పుడు ఎవరైనా భయపడటం సహజం

‘అయితే వరుసగా ఓడిపోతున్నప్పుడు ఎవరైనా భయపడటం సహజం. ప్రస్తుతం ఆటగాళ్ల మైండ్‌సెట్ పరంగా తీసుకుంటే, ఆసీస్ కంటే భారత్‌దే పైచేయిగా కనిపిస్తోంది. వన్డేల్లో అగ్రస్థానాన్నిచేజిక్కించుకుని భారత్ మంచి జోరుమీదుంది. ఈ తరుణంలో వారిని టీ20ల్లో ఎదుర్కోవడం కొంచెం కష్టమే. జట్టులో టాలెంట్‌కు కొదవ లేదు. ఈ టీ20 సిరీస్‌లో ఈ సమస్యను అధిగమిస్తాం’ అని చెప్పాడు.

india

వరల్డ్‌కప్ మరో రెండేళ్లలో జరగనున్న 
ఇంగ్లాండ్‌లో 2019 వరల్డ్‌కప్

వరల్డ్‌కప్ మరో రెండేళ్లలో జరగనున్న నేపథ్యంలో విదేశాల్లో ఆడటానికి తగినట్లు ఆస్ట్రేలియా జట్టు సన్నద్ధమవ్వాల్సిన అవసరం ఉందని అన్నాడు. 2019 వరల్డ్‌కప్ ఇంగ్లాండ్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. సొంతగడ్డపై జరిగిన 2015 వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత విదేశాల్లో ఆస్ట్రేలియా ప్రదర్శన ఏమాత్రం బాగాలేదు.

Aus-cricket

ఇదే గనుక కొనసాగితే వచ్చే 
వరల్డ్ కప్‌లో ఆసీస్ గడ్డు పరిస్ధితులను ఎదుర్కొవాల్సి

ఇదే గనుక కొనసాగితే వచ్చే వరల్డ్ కప్‌లో ఆసీస్ గడ్డు పరిస్ధితులను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే శనివారం నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరిస్ కోసం జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, డాన్ క్రిస్టియన్, మోయిసెస్ హెన్రిక్స్, టిమ్ పెయిన్, ఏజే టైలాంటి కొత్త ఆటగాళ్లు జట్టులోకి వస్తున్నారు. ఇరు జట్ల మధ్య శనివారం రాంచీ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఐదు వన్డేల ఈ సిరీస్‌ని భారత్ 4-1తేడాతో కైవసం చేసుకుని వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంక్‌ని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే.