నాని, సాయి పల్లవిల మధ్య గొడవ…నిజమేనా? అసలు నిజం మీకోసం!

నాని, సాయి పల్లవిల మధ్య గొడవ…నిజమేనా? అసలు నిజం మీకోసం!

ప్రేమమ్ లో మలర్ పాత్రతో మళయాళంలో… ఫిదా సినిమాలో భానుమతి పాత్రతో తెలుగులో సాయి పల్లవి ప్రేక్షకులను మైమరపింపజేసింది. ఫిదాలో ఆమె నటనకు.. డైలాగ్ డెలివరీకి.. డ్యాన్సులకు మొత్తం తెలుగు వాళ్లంతా ఫిదా అయిపోయారు. అప్పటినుంచి ఆమెకు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చిపడినా వాటిలో చాలావాటికి సీరియస్ గా నో చెప్పేసింది. ఆచితూచి చాలా సెలక్టివ్ గా మాత్రమే సినిమాలు చేస్తానని కచ్చితంగా చెప్పేసింది. 

ఫిదా సినిమా విజయం వెనుక శేఖర్ కమ్ముల దర్శకత్వ ప్రతిభ ఎంతో ఉంది. కానీ అనుకోని విధంగా క్రెడిట్ మొత్తం సాయి పల్లవి అకౌంట్ లోకి వెళ్లిపోయింది. ఈ సినిమా విజయం తలకెక్కడంతో ఇప్పుడు ఆమె ఎవరినీ కేర్ చేయడం లేదట. రీసెంట్ గా తన సహజ నటనతో పేరుతెచ్చుకున్న యంగ్ హీరో నాని తో చేస్తున్న సినిమాలో అంతా తనిష్టం అన్నరీతిలో వ్యవహరించడంతో నాని ఆమెపై చిరాకు పడిపోయాడట. షూటింగ్ కు లేటుగా రావడం.. అదేమని అసిస్టెంట్ డైరెక్టర్లు అడిగినా సమాధానం ఇవ్వకపోవడంతో చిత్ర యూనిట్ అవాక్కవ్వాల్సి వచ్చింది. దీనికితోడు ఆ నానితో సాయిపల్లవికి మాటామాటా తేడా వచ్చి.. చివరకు సెట్స్ నుంచి మధ్యలోనే వెళ్లిపోయాడని టాక్.

ఈ గొడవలో తప్పెవరది అన్నదానిపై ఇంకా క్లారిటీ రాకపోయినా సాయిపల్లవి తీరుపై మరికొన్ని విమర్శలు లేకపోలేదు.

నాని, సాయి పల్లవిల మధ్య గొడవ.. నిజమే !

కాని ఈ విషయాని గాసిప్పులు వస్తూనే ఉంటాయని లైట్ తీసుకొన్నారు. అత్యంత విశ్వసనీయ సమాచారమ్ ప్రకారం నాని-సాయిపల్లవిల గొడవ నిజమేనని తెలిసింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నాని-సాయిపల్లవి జంటగా ‘ఎంసీఏ’ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ సందర్భంగా, ఓ డైలాగుకు సంబంధించి సాయి పల్లవికి నాని ఓ సలహా ఇవ్వబోయాడట. ఇదే వీరిద్దరి మధ్య గొడవకు కారణమయిందట. ఇప్పటికీ వీరిద్దరు ఎడమొహం, పెడమొహం లా ఉంటున్నారట. ఈ గొడవకు పులిస్టాప్ పెట్టేందుకు దర్శక-నిర్మాతలు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదని తెలిసింది. వీరిద్దరూ కలసి ఏదో ఇక విధంగా షూటింగ్ పూర్తి చేసేసి. మాట్లాడుకోకుండానే వెళ్లిపోతున్నారట.

వరుస హిట్స్ తో నాని జోరుమీదున్నాడు. స్టార్ హీరోగా ఎదుగుతున్నాడు. మరోవైపు, సాయిపల్లవి ఇప్పుడిప్పుడే క్రేజ్ సంపాదించుకుంటోంది. ఆమె కెరీర్ లో ప్రేమమ్, ఫిదా రెండు హిట్స్ మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలో బెట్టు చేయడం, ఏకంగా హీరోతో గొడవ పడటం ఆమె కెరీర్ కి మంచిది కాదేమోనని అంటున్నా