అర్ధం చేసుకునే వ్యక్తి దొరికితే మళ్ళీ పెళ్ళి చేసుకుంటా…! : రేణు దేశాయ్

అర్ధం చేసుకునే వ్యక్తి దొరికితే మళ్ళీ పెళ్ళి చేసుకుంటా…! : రేణు దేశాయ్

ఒంటరిగా ఉండటం కష్టమనిపిస్తోందని.. తనను అర్ధం చేసుకునే వ్యక్తి దొరికితే పెళ్లి గురించి ఆలోచిస్తానని ఇటీవల సినీ నటి రేణు దేశాయ్ పేర్కొన్న విషయం విదితమే. ఆమె చెప్పిన విషయాన్ని అసహ్యించుకుంటూ కొందరు మెసేజ్‌లు చేస్తున్నారని.. ఇది తన ఒక్కదానికి ఎదురవుతున్న పరిస్థితి కాదని మహిళలంతా ఎదుర్కొంటున్న పరిస్థితి అంటూ తన ఆవేదనను సోషల్ మీడియాలో రేణు వెలిబుచ్చారు.

“ఈ పోస్టు కేవలం నన్ను ఉద్దేశించింది అని నేను అనుకోవట్లేదు. ఈ పోస్టు నా వ్యక్తిగతం కాదు. కానీ ఇలాంటి కామెంట్స్ చదివినపుడు అసలు మనం ఇలాంటి సమాజంలో, ఇలాంటి మైండ్‌ సెట్ ఉన్న మగవాళ్ల మధ్య బతుకుతున్నాం? అని చాలా ఆందోళనగా అనిపిస్తుంది. ఒకవైపు, మహిళా సమానత్వం, ఇంకో వైపు 7సంవత్సరాలు నేను ఒంటరిగా ఉండి.. ఇప్పుడు నాకు ఒక ఒక లైఫ్ పార్ట్‌నర్ ఉంటే బాగుండు అని జస్ట్ చెప్పినపుడు.. నాకు హేట్ మెసేజెస్ పంపుతున్నారు. మన దేశంలో, ఒక మగాడు ఏమైనా చెయ్యొచ్చు.. ఎన్ని సార్లైనా పెళ్లి చేసుకోవచ్చు.

renu-desai-ready-for-second-marrage-latest-inteverview-breacking-news
కానీ ఒక అమ్మాయి ఇంకో రిలేషన్ గురించి ఆలోచించడం కూడా తప్పు! తను లైఫ్ లాంగ్.. తప్పు చేశానన్న ఫీలింగ్‌తో ఒంటరిగా బతకాలా? ఈ దేశంలో అమ్మాయిల పరిస్థితి భవిష్యతులో బాగుండాలంటే..

మహిళలు వాళ్ల కొడుకులను పద్ధతిగా పెంచాలని నేను సిన్సియర్‌గా భగవంతుణ్ని వేడుకుంటున్నా. అప్పుడైనా మగవాళ్ల మైండ్‌సెట్‌లో మార్పు వస్తుందేమో!” అంటూ రేణు దేశాయ్ సోషల్ మీడియాలో తన ఆవేదనను వెల్లడించారు. తనకు వచ్చిన మెసేజ్‌ల స్కీన్ షాట్‌లను కూడా ఆ పోస్ట్‌కు అటాచ్ చేశారు.