చిరు 151కి .. రెహమాన్ గుడ్ బై ?

చిరు 151కి .. రెహమాన్ గుడ్ బై ?

మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రంగా చారిత్రాత్మక కధాంశంతో సైరా నరసింహారెడ్డి తెరకెక్కుతోంది. ఇప్పటికే సెట్స్ లో ఉండాల్సిన ఈ మూవీ ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లోనే ఉంది. భారీ కాస్టింగ్ సెట్స్ వగైరా ప్రిపరేషన్ కు ఈ ఆల్యసం మామూలే. అయితే శాతకర్ణి సినిమాను అలా ఒప్పించి ఇలా షూట్ చేసి రిలీజ్ చేసిన క్రిష్ తో పోలిస్తే సైరా టీమ్ స్లో గానే ఉందని ఫాన్స్ టాక్. ఇక సీన్ లోకి వస్తే ముందుగా ఈ మూవీకి తమన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేసి బాలీవుడ్ తమిళ్ వెర్షన్స్ ను దృష్టిలో ఉంచుకొని రెహమాన్ ను కన్ఫర్మ్ చేశారు. అయితే యూనిట్ కు రెహమాన్ కు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ తో రెహమాన్ బై చెప్పేసినట్టే అని టాక్.

అసలు విషయం బయటకు రావడంలేదు కానీ జనరల్ గా మెగా కాంపాండ్ సినిమా అంటే టెక్నీషియన్స్ అంతా ప్రీ షూట్ నుండి సినిమా పూర్తి అయ్యేవరకు రూల్స్ ను అనుగుణంగా అలర్ట్ గా ఉండాల్సిందే. ఈ విషయంలో రెహమాన్ ను కూడా రెగ్యులర్ సిట్టింగ్స్ లో ఉండేలా చేసే పనిలో తనకు కుదరదని చెప్పేసినట్టు టాక్. పైగా తక్కువగా సినిమాలు కమిట్ అవుతున్న రెహమాన్ బ్రూస్లీ బయోపిక్ కు సైన్ చేసాడని టాక్. ఇపుడు సైరా టీమ్ లోకి మళ్ళీ తమన్ చేరే ఛాన్స్ కనిపిస్తోందని పోస్టర్ కు తానిచ్చిన సౌండ్ యూనిట్ ను ఫాన్స్ ను ఇంప్రెస్ చేసింది కూడా.