కోహ్లీ వీక్నెస్ బాలు నైల్కు తెలిసిందా? అందుకే 5 లో 3 సార్లు…!

కోహ్లీ వీక్నెస్ బాలు నైల్కు తెలిసిందా? అందుకే 5 లో 3 సార్లు…!

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ తీయడమే లక్ష్యంగా ప్రత్యర్ధి బౌలర్లు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కోహ్లీ వికెట్ తీయగలిగితే సగం మ్యాచ్ గెలిచినట్లేనని ప్రత్యర్ధి జట్లు భావిస్తుంటారు. కోహ్లీ ఎక్కువసేపు మైదానంలో ఉంటే పరుగుల వరద పారిస్తాడు. దీంతో అతడిని నిలువరించడం కష్టం అవుతుంది.

దీంతో కోహ్లీని అవుట్ చేసేందుకు గాను ఎన్నో వ్యూహాలు రచిస్తారు. తాజాగా ఆసీస్‌తో జరిగిన ఐదు వన్డేల సిరిస్‌లో ఆ జట్టు బౌలర్లు ఈ విషయంలో కోహ్లీని కట్టడి చేసినట్లుగానే కనిపించారు. ముఖ్యంగా ఈ వన్డే సిరిస్‌లో కోహ్లీని తక్కువ స్కోర్లకే ఆసీస్ బౌలర్లు నిలువరించగలిగారు. ఇక్కడ విశేషం ఏమిటంటే కోహ్లీని మూడుసార్లు నాథన్‌ కౌల్టర్‌ నైల్‌ అవుట్ చేయడం.

ఐదు వన్డేల సిరిస్‌లో 
మొత్తం మూడు సార్లు కోహ్లీని అవుట్ చేసిన నైల్

ఐదు వన్డేల సిరిస్‌లో రెండుసార్లు కోహ్లీ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్న నైల్‌ మరోసారి క్యాచ్‌ ద్వారా అతన్ని పెవిలియన్‌కు పంపడంతో విజయవంతం అయ్యాడు. కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన రెండో వన్డేలో కోహ్లీ 92 పరుగులతో సెంచరీకి చేరువైన సమయంలో కౌల్టర్ నైల్ వేసిన అద్భుతమైన బంతికి కోహ్లీ వెనుదిరిగాడు.
బెంగళూరు వేదికగా జరిగిన 
ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ను తాకి నేరుగా వికెట్లు

నైల్ వేసిన బంతి కోహ్లీ బ్యాట్‌ ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ను తాకి నేరుగా వికెట్లకు తాకింది. ఇక, బెంగళూరు వేదికగా జరిగిన నాలుగో వన్డేలోనూ నైల్‌ అదే తరహాలో మరోసారి కోహ్లీని క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. నైల్‌ వేసిన బంతిని థర్డ్‌ మాన్‌ మీదుగా తరలించేందుకు కోహ్లీ ప్రయత్నించగా బంతి బ్యాట్‌ లోపలి అంచునుతాకి వికెట్లను తాకింది.

indian bats men kohli

దీంతో 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద 
కోహ్లీసేన వరుస విజయాలకు కూడా బ్రేక్

దీంతో 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ పెవిలియన్‌కు చేరాడు. బెంగళూరు వన్డేలో కోహ్లీసేనపై ఆస్ట్రేలియా 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతేకాదు కోహ్లీసేన వరుస విజయాలకు కూడా బ్రేక్ వేసింది. చెన్నై వేదికగా జరిగిన తొలి వన్డేలో మ్యాక్స్‌వెల్‌ వేసిన బంతిని ఎదుర్కొన్న కోహ్లీ నైల్‌కి క్యాచ్‌ ఇచ్చి పరుగులేమీ చేయకుండానే అవుటయ్యాడు.

indian captain kohli

ఐదు వన్డేల సిరిస్‌లో కోహ్లీ విజృంభణకు 
కోహ్లీ విఫలమవడానికి నైలే కారణం

ఐదు వన్డేల సిరిస్‌లో కోహ్లీ విజృంభణకు ఆసీస్ బౌలర్ నైల్ అడ్డుతగిలాడనే చెప్పాలి. నైల్‌ దెబ్బకు కోహ్లీ ఈ వన్డే సిరీస్‌లో మొత్తం 180 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మరోవైపు రోహిత్‌ శర్మ(296), రహానె(244), హార్దిక్‌ పాండ్య(222)లు కోహ్లీ కంటే ముందు ఉన్నారు. పాండ్యా మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ సైతం అందుకున్నాడు.

captain kohli

ఐదు వన్డేల సిరిస్‌లో కోహ్లీ పెవిలియన్‌కు 
మూడు బంతులు ఒకే తరహాలో

ఐదు వన్డేల సిరిస్‌లో కోహ్లీ పెవిలియన్‌కు చేరిన ఈ మూడు బంతులు ఒకే తరహాలో ఉండటం విశేషం. ఇలాంటి బంతులను ఎదుర్కొనేందుకు కోహ్లీ గతంలో కూడా ఇబ్బంది పడ్డాడు. లండన్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో లీగ్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో నువాన్‌ ప్రదీప్‌ బౌలింగ్‌లో, పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆమీర్‌ వేసిన ఈ తరహా బంతులకే కోహ్లీ అవుటయ్యాడు.

kohli indian

ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ రెండు మ్యాచ్‌ల్లోనే 
మూడు టీ20 సిరిస్‌లో అదే తరహా బంతులు

ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ రెండు మ్యాచ్‌ల్లోనే టీమిండియా ఓటమి పాలైంది. ఈ క్రమంలో కోహ్లీ వీక్‌నెస్‌ను గుర్తించిన ఆస్ట్రేలియన్లు శనివారం నుంచి ప్రారంభం కానున్న మూడు టీ20 సిరిస్‌లో అదే తరహా బంతులు వేసి కోహ్లీని నిలువరించాలనే ఉద్దేశంలో ఉన్నారు. మరోవైపు కోహ్లీ సైతం ఈ తరహా బంతులనే నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు.