కమనీయంగా చైతూ, సమంతల కల్యాణం…

కమనీయంగా చైతూ, సమంతల కల్యాణం…

టాలీవుడ్‌లో మరో ప్రేమ జంట దాంపత్య జీవితంలో ఒక్కటైంది. కొద్ది సంవత్సరాలు ప్రేమించుకొంటున్న అక్కినేని నాగచైతన్య, సమంత జీవిత భాగస్వాములుగా మారారు. వీరి వివాహం గోవాలో వేద మంత్రాల నడుమ, హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు మీకోసం..

sam-and-chaithu-marraige-pic-6

ఏం మాయ చేశావే చిత్ర షూటింగ్‌లో సమంత, నాగ చైతన్యలు ఒకరికొకరు పరిచయం అయ్యారు. వారి పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత జీవితంలో ఒక్కటవ్వాలని నిర్ణయించుకొన్నారు.

 

ప్రేమ జంట చైతూ, సమంతలు తమ కుటుంబ సభ్యులకు పెళ్లి ప్రతిపాదనను చెప్పడంతో ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అక్కినేని నాగార్జున కుటుంబం సమంతను కోడలుగా ఆహ్వానించడానికి ఆనందంగా స్పందించింది.

2017లో దక్షిణాది సినీ పరిశ్రమలో గొప్పగా చెప్పుకునే సెలబ్రిటీ పెళ్లిగా చైతూ, సమంతల వివాహం మారింది. అతి కొద్ది మంది హాజరుకాగా అక్టోబర్ 6వ తేదీన ఈ వివాహం జరిగింది.

సమంత క్రిస్టియన్ మతానికి చెందడంతో చైతూ, సమంతల పెళ్లిని రెండు మతాల ప్రకారం చేయాలని నిర్ణయించారు. ముందుస్తు ప్రణాళిక ప్రకారం గోవాను వేదికగా ఎంపిక చేశారు.

సమంత వినయంగా సంతోషంతో తలదించుకోగా నాగచైతన్య తలంబ్రాలు పోస్తున్న ద‌‌ృశ్యం.

పెళ్లీ పీటలపై వేద పండితుడు చెప్పిన మంత్రాల మధ్య నవ్వులు చిందిస్తున్న వధూవరులు.

కళ్యాణవేదికపై పెళ్లిదండలు మార్చుకొంటున్న నాగ చైతన్య, సమంత

వధూవరుల మధ్య పెళ్లికి ముందు సంప్రదాయ పద్ధతిని పాటిస్తూ అడ్డుతెర పట్టిన దృశ్యం.

పెళ్లి పీటలపై కూర్చుంటున్న నాగచైతన్య