మానవత్వం అసలు ఉందా…? చదివీతే మికె తెలుస్తుంది.

మానవత్వం అసలు ఉందా…? చదివీతే మికె తెలుస్తుంది.

మన్సూరాబాద్‌/హైదరాబాద్:అదో ఐదంతస్థుల అపార్టుమెంటు. అందులో పదిహేను కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఆ అపార్టుమెంట్‌లోని ఓ ఫ్లాటులో ఒంటరిగా ఉంటున్న ఓ వృద్ధుడు ప్రమాదవశాత్తు ఇంట్లోనే కిందపడి మృతి చెందాడు. నెలన్నర రోజు లు కావస్తున్నా.. ఆ విషయం అపార్టుమెంటువాసులెవరికీ తెలియని పరిస్థితి. వృద్ధుడి ఫ్లాటు గుమ్మానికి.. ఎదురుగానే మరో గు మ్మం ఉంది. కానీ ఆ ఫ్లాటులో ఉంటున్న వారు కూడా కనీసం గమనించలేదు. అమెరికాలో ఉంటున్న భార్య, పిల్లలు వచ్చే వరకూ శవం కుళ్లిపోయి గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురానికి చెందిన అలమూరు సత్యసుబ్రహ్మణ్య లక్ష్మీనారాయణమూర్తి (71) సబ్‌రిజాస్ట్రార్‌ కార్యాలయంలో పనిచేసి రిటైరయ్యారు. ఇతడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు సౌజన్య, వందన ఉన్నారు. పిల్లలిద్దరు అమెరికాలో ఉంటున్నారు. భార్యాభర్త లు రాజమండ్రిలో ఉంటున్నారు. కాగా పిల్లల కోరి క మేరకు కొన్నినెలల కిందట భార్య లక్ష్మిని అమెరికా పంపించిన లక్ష్మీనారాయణమూర్తి రాజమండ్రిలో ఒక్కడేఉంటున్నాడు. ఆయన కూతురు సౌజన్యకు ఎల్‌బీనగర్‌ రాక్‌టౌన్‌ కాలనీలోని సాయి మారుతీ రెసిడెన్సీ అపార్టుమెంట్‌లో ఫ్లాటు ఉంది. హైదరాబాద్‌కొస్తే మూర్తి దంపతులు ఆ ఫ్లాటులో కొన్నాళ్లు ఉండి వెళ్తుంటారు. ఈక్రమంలో ఆగస్టులో బంధువుల శుభకార్యానికి నగరానికొచ్చిన మూర్తి రాక్‌టౌన్‌ కాలనీలోని ఫ్లాటులో ఉన్నాడు. కాగా అమెరికా నుంచి భార్య, కూతుర్లు కొన్ని రోజులుగా అతడికి చాలాసార్లు ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయలేదు. దీంతో ఆందోళనకు గురైన భార్య లక్ష్మి, కూతురు సౌజన్య ఈ నెల 3న ఇంటికొచ్చారు. సెంట్రల్‌ లా కింగ్‌ ఉన్న తలుపు ఎంతకూ తెరుచుకోకపోవటంతో పగులకొట్టి చూడగా కుళ్లిపోయిన స్థితిలో లక్ష్మీనారాయణమూర్తి మృతదేహం కన్పించింది. దీంతో కంగుతిన్న వారు.. మృతదేహం చూసి బోరు న విలపించారు. లోపలి నుంచి ఒక్కసారిగా వచ్చి న దుర్వాసనతో అందరూ ఉక్కిరిబిక్కిరయ్యారు. నెలన్నర రోజులు కావస్తున్నా మృతదేహం నుంచి పక్కింటి వారికి కూడా వాసన రాకపోవడం గమనార్హం..!

బల్ల్లిపై కాలు వేసి.. కిందపడి..?

లక్ష్మీనారాయణమూర్తి ఒంటిపై టవల్‌ తప్ప.. ఇంకేమీలేవు. వెనక్కిపడినట్లుగా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే బాత్‌రూంలో స్నానం చేసి వస్తూ.. అనుకోకుండా బల్లిపై కాలు వేయ డంతో జారి కిందపడిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఆయన మృతదేహం పక్కన చనిపోయిన బల్లిని కూడా గుర్తించారు. లక్ష్మీనారాయణమూర్తి కిందపడి కొనప్రాణంతో ఉన్నా.. ఎవరూ చూడకపోవటంతోనే అతను ప్రాణాలు విడిచినట్టు స్థానికులు భావిస్తున్నారు. కాగా లక్ష్మీనారాయణమూర్తి ఉన్న ఫ్లాటు గుమ్మానికి ఎదురుగా పక్కనే ఫ్లాటు, ఆ పక్కనే మరో ఫ్లాటు ఉంది. కానీ ఆ ఫ్లా ట్లలో ఉంటున్న వారెవరూ దాదాపు నెలన్నర రోజు లుగా గుర్తించకపోవటం బాధాకరం. నగరాల్లో మా నవ సంబంధాలు మంటగలుస్తున్నాయనడానికి మూర్తి మృతి నిదర్శన. ఉరుకుల పరుగుల జీవనంలో తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఎడబాటు పెరుగుతోంది. పిల్లల దగ్గర వృద్ధ తల్లిదండ్రులు ఉండలేని పరిస్థితులు సమాజం కల్పిస్తుండటంతో వారు ఒంటరిగానే జీవించాల్సిన పరిస్థితులున్నాయి.