ఎన్టీఆర్ అత్యంత కుమిలిపోయిన సందర్భం అదే…

ఎన్టీఆర్ అత్యంత కుమిలిపోయిన సందర్భం అదే…

విజయవాడ: టీడీపీతో తన అనుబంధం.. ఎన్టీఆర్ తర్వాత పార్టీ వైఖరిపై సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో శుక్రవారం మహానటి సావిత్రి కళాపీఠం ఆధ్వర్యంలో ఆయనకు సన్మానం చేసిన సందర్భంగా మాట్లాడారు.

టీడీపీ వ్యవస్థాపకుల్లో ఒకరినైన తనను సలహాల కోసం ఆ పార్టీ ఏనాడూ సంప్రదించలేదన్నారు. ఎన్టీఆర్ తర్వాత పార్టీ అవలంభిస్తున్న వైఖరిపై ఆయన పెదవి విరిచారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

ఎమ్మెల్యేగా 
ఎమ్మెల్యే టికెట్ ప్రయత్నాలు:

టీడీపీ ప్రారంభం నుంచి తాను ఎన్టీఆర్‌తో కలిసి తిరిగానని, ఎమ్మెల్యేగా టికెట్‌ ఇవ్వడానికి అన్నగారు ప్రయత్నించారని కైకాల చెప్పారు. అయితే కొన్ని ప్రతికూల కారణాల వల్ల ఆ ప్రయత్నాలు ఫలించలేదన్నారు.

ఎన్నడూ లేనంతగా: 
అత్యంత కుమిలిపోయిన సందర్భం:

కానీ ఆ తర్వాతి రోజుల్లో మచిలీపట్నం నుంచి ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిచానని గుర్తుచేశారు. సీనియర్ ఎన్టీఆర్ తనను నమ్ముకున్నవాళ్లకు ఏదో ఒకటి చేశారని చెప్పుకొచ్చారు. ‘నమ్మకద్రోహంతో పదవి పోగొట్టుకున్న సమయంలోనే ఎన్టీఆర్ గతంలో ఎన్నడూ లేనంతగా బాధపడ్డారని’ గుర్తు చేసుకున్నారు.

బాబు అలా చేస్తున్నట్లు లేదు: 
బాబు తీరు అలా లేదు:

ఇక అవార్డుల గురించి ప్రస్తావిస్తూ.. ప్రభుత్వ పురస్కారాల కోసం చాలా లాబీయింగ్ చేయాల్సి ఉంటుందని, అది తనకు ఇష్టం లేదని అన్నారు. ప్రభుత్వమే నామినేట్ చేయాలని, కానీ వాళ్లు మాత్రం పార్టీ సభ్యుడివి అన్న సాకుతో దాని గురించి పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ‘సీఎం చంద్రబాబు ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నట్లు ఎక్కడా కనిపించడం లేదని’ అన్నారు.

ఏదొక పార్టీతో 
పార్టీతో సంబంధం ఉన్నవాళ్లే:

ప్రస్తుతం పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలను దక్కించుకున్నవాళ్లంతా ఏదో ఒక పార్టీతో అనుబంధం ఉన్నవాళ్లేనని గుర్తుచేశారు. పురస్కారాలు నటీనటుల బాధ్యతను మరింత పెంచుతాయని సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. నటనను ఓ తపస్సులా భావించాలని చెప్పుకొచ్చారు.