భరత్ అను నేను లీక్.. బయటపడుతున్న నిజాలు..!

భరత్ అను నేను లీక్.. బయటపడుతున్న నిజాలు..!

సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా భరత్ అను నేను. ఈ సినిమా నుండి రీసెంట్ గా ఓ పిక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. సినిమాలో మహేష్ సిఎం పాత్రలో కనిపిస్తుండగా.. సిఎం మహేష్ అతని సెక్యురిటీ, పక్కన పిఏ ఇలా ఓ పిక్ సోషల్ మీడియాలో లీక్ అయ్యింది.

ఈ పిక్ ఎలా లీక్ అయ్యిందో అన్న విషయం తెలియదు కాని కొరటాల శివ మాత్రం దీని మీద ఫైర్ అయ్యాడు. అయితే సినిమాలో ఈ లీకేజ్ అంతా కావాలనే చేశారని టాక్. స్పైడర్ తో మహేష్ నిరాశ పరచగా ఆ వార్తల నుండి బయటకు వచ్చేలా భరత్ అను నేను పిక్ కావాలనే లీక్ చేశారని అంటున్నారు. లీకైన పిక్చర్ క్వాలిటీ కూడా బాగా ఉండటంతో ఈ వార్తలకు బలం వస్తుంది.

అయితే కొరటాల శివ మాత్రం సినిమాలో మహేష్ రోల్ లుక్ ఇలా లీక్ అవడం సహించలేకున్నాడు. దయచేసి ఈ ఫోటో స్ప్రెడ్ చేయొద్ధని వేడుకున్నాడు. స్పైడర్ సినిమా ఫీవర్ నుండి ఆడియెన్స్ ను డైవర్ట్ చేసే ఆలోచనతోనే భరత్ అను నేను పిక్ వదిలారట. సినిమాపై అంచనాలను పెంచేందుకే ఈ లాజిక్ ఫాలో అయ్యారని అంటున్నారు.

అది ఎంతవరకు నిజం అన్నది తెలియదు కాని సినిమాలో మహేష్ లుక్ ఎప్పటిలానే అదిరిపోయింది. సిఎంగా మహేష్ అదరగొడతాడని అంటున్నాడు కొరటాల శివ. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలతో కమర్షియల్ హిట్ కొడుతున్న శివ మహేష్ తో మళ్లీ సూపర్ హిట్ కొట్టేస్తా అంటున్నాడు. సమ్మర్ లో రాబోతున్న ఈ సినిమా హిట్ మహేష్ కు చాలా అవసరం.