పవన్ కళ్యాణ్ సినిమాకి ఇలాంటి టైటిలా ?

పవన్ కళ్యాణ్ సినిమాకి ఇలాంటి టైటిలా ?

త్రివిక్రమ్ మంచి టేస్ట్ వున్న దర్శకుడు. ఆయన రాతా తీతా రెండూ క్లాస్ అండ్ స్టైలిస్ గా వుంటాయి. సినిమా పేర్లు పెట్టడంలో కూడా త్రివిక్రమ్ ది డిఫరెంట్ స్టయిల్. ఇప్పుడు మరో డిఫరెంట్ టైటిల్ తో ముందుకు వచ్చాడు త్రివిక్రమ్.

పవన్ కల్యాణ్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం టైటిల్ పై చాలా సస్పెన్స్ నడిచింది. అయితే చిత్రాన్ని నిర్మిస్తున్న హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ తాజాగా ‘అజ్ఞాతవాసి’ అన్న పేరును ఫిలిం చాంబర్ లో రిజిస్టర్ చేయించింది. దీంతో ఇదే పవన్ కొత్త సినిమా పేరన్న భావనకు వచ్చిన అభిమానులు ఈ పేరుతో పోస్టర్లు తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

ఇక టైటిల్ విషయానికి వస్తే.. త్రివిక్రమ్ మొదటి నుండి మంచి పంచ్ వున్న టైటిల్స్ ను పెడుతుంటారు. జల్సా, అతడు, ఖలేజా..ఇలా పవర్ ఫుల్ గా సాగేవి కొన్ని.. అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అ ఆ.. ఇలా క్లాస్ టచ్ తో సాగేవి మరికొన్ని. అయితే ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా వుంది.

ఇది అచ్చ తెలుగు టైటిల్ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు ఇది షూట్ అవుతుందా ?అనే చర్చ కూడా సాగుతుంది. త్రివిక్రమ్ కు పురాణాలు ఇతిహాసాలు అంటే పిచ్చి. ‘అజ్ఞాతవాసి’ అంటే పాండవుల ఎపిసోడ్ గుర్తుకు వస్తుంది. బహుసా అందులో ఎదో క్యారెక్టర్ నుండి ఈ టైటిల్ కు ప్రేరణ వచ్చివుటుంది.