చైతూ-సమంత పెళ్లి సేమ్ టు సేమ్

చైతూ-సమంత పెళ్లి సేమ్ టు సేమ్

నాగచైతన్య, సమంతల వివాహం గోవాలో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అక్టోబర్ 6 న హిందూ సంప్రదాయం ప్రకారం, అక్టోబర్ 7న క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం చైతూ, సమంతల పెళ్లి జరిగింది. తమ ఫ్యామిలీ సభ్యులు కాకుండా కేవలం వంద మంది మాత్రమే హాజరయిన ఈ పెళ్లికి సంబంధించిన ప్రతి విషయాన్ని నాగ్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకొన్నారు. ఈ పెళ్లితో నాగార్జున ఎంత సంతోషంగా ఉన్నారో అతను చేసిన పోస్ట్‌ల ద్వారా తెలుస్తోంది.

ఇక ప్రేమను జయించి పెద్దలు సమక్షంలో రియల్‌గా రెండు రకాలుగా అంటే హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాలలో పెళ్లి చేసుకొన్న నాగచైతన్య, సమంతల జంట.. రీల్ లైఫ్‌లో కూడా రెండు రకాలుగా మ్యారేజ్ చేసుకోవడం విశేషం. వారు నటించిన ‘ఏ మాయ చేసావే’ చిత్రంలో జెస్పి, కార్తీక్‌లు క్రిస్టియన్ సంప్రదాయంలో పెళ్లి చేసుకుంటే, ‘మనం’ చిత్రంలో హిందూ సంప్రదాయంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

సేమ్ టు సేమ్ ఇప్పుడు రీల్ లైఫ్‌లోలా రియల్ లైఫ్‌లో కూడా వీరు రెండు రకాలుగా పెళ్లి చేసుకొని రీల్ లైఫ్ పెళ్లిళ్లను నిజం చేశారు. కొన్ని కొన్ని సార్లు లైఫ్‌లో జరగబోయే విషయాలు ముందుగానే తెలియడం అంటే ఇదేనేమో!. ‘మనం’ చిత్ర కాన్సెప్ట్ కూడా దాదాపు ఇలానే ఉంటుంది. ఏదేమైనా ప్రేమని జయించి పెళ్లి చేసుకొన్న ఈ జంట మాత్రం ఇప్పుడు సినీ సెలబ్రిటీలెందరికో ఆదర్శంగా నిలిచింది. మున్ముందు కూడా ఇలానే ఆదర్శంగా నిలిచేలా తమ లైఫ్‌ని కొనసాగించాలని కోరుకుంటూ ‘నేటి వార్తలు’ శుభాకాంక్షలు తెలుపుతోంది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ టు డియర్ చైతూ అండ్ సామ్.