చైనా ఫోన్లు వాడుతున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్.

చైనా ఫోన్లు వాడుతున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్.

మీరు చైనా కంపెనీ ఫోన్లు వాడుతున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. చైనా మొబైల్‌ ఫోన్లలో రేడియేషన్‌ అధికంగా ఉంటుందనే వార్త కలకలం రేపుతోంది. ఆ కంపెనీ ఫోన్లలోని టచ్‌ స్క్రీన్లు.. కంటిచూపును దెబ్బతీస్తాయనే విషయం వెలుగులోకి వచ్చింది. చౌక ధరకు అధిక ఫీచర్లతో లభించే ఈ ఫోన్లు వాడితే.. ఆరోగ్యానికి ప్రమాదం అనే భయంకరమైన వాస్తవం బయటపడింది.

చైనా ఫోన్లు వాడితే రెటీనా దెబ్బంతింటుందనే వాదనలు.. వార్తలు కొంతకాలంగా హల్‌చల్‌ చేస్తున్నాయి.. ఇవి నిజమే? అనేలా ఒక సంఘటన చోటు చేసుకుంది.

చైనా రాజధాని బీజింగ్‌ లో 21 ఏళ్ల అమ్మాయి.. 24 గంటల పాటు చైనా కంపెనీ మొబైల్‌ ఫోన్‌ లో గేమ్స్‌ అడుతూ.. కంటి చూపును కోల్పోయింది. ఈ విషయం ఇప్పుడు చైనాలో హాట్‌ టాపిక్‌ గా మారింది. సుదీర్ఘ సమయంపాటు ఆన్‌ లైన్‌ గేమ్‌ అయిన ‘హానర్‌ ఆఫ్‌ కింగ్స్‌’ అనే గేమ్‌ను రోజంతా ఆడింది. అదే పనిగా ఫోన్ స్క్రీన్‌ను చూడటంతో ఆమె కుడి కన్ను తీవ్ర ఒత్తిడికి గురైంది. అదే సమయంలో ఉన్నట్టుండి ఆమె కుడి కన్ను పూర్తిగా మసకబారింది. ఆ తర్వాత చూపు కోల్పోయింది.

దీంతో ఆ యువతిని హాస్పిటల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. చూపు కోల్పోయిన కంటిని వైద్యులు పరీక్షలు జరిపి ఆశ్చర్యకర విషయాన్ని తెలిపారు. ఇటువంటి వ్యాధిని వైద్య పరిభాషలో రెటినల్‌ ఆర్టెరీ అక్లూషన్‌(RAO) గా పిలుస్తారని చెప్పారు. ఇటువంటి వ్యాధి సాధారణంగా వయసు మళ్లిన వారికి వస్తుందని.. ఇంత చిన్న వయసులో రావడం అరుదని అన్నారు. ఆ అమ్మాయి చాలా సమయం స్క్రీన్‌ కేసి చూడడం వల్ల ఈ వ్యాధి వచ్చిందని స్పష్టం చేశారు. ఇటువంటి గేమ్స్‌ ఆడే సమయంలో స్క్రీన్‌ నుంచి తక్కువ రేడియేషన్‌ వచ్చే ఫోన్లను వినియోగించాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఆ యువతి ఇప్పటికీ హాస్పిటల్లోనే చికిత్స పొందుతోంది. దెబ్బతిన్న చూపును తిరిగి రప్పించడానికి డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు. హానర్ ఆఫ్ కింగ్స్ గేమ్‌ ఆడేందుకు ఒక్క చైనాలో 200 మిలియన్ల మంది రిజిస్టర్ చేసుకున్నారు. చాలా మంది ఆ గేమ్‌కు బానిసయ్యారు. ఆన్‌లైన్ గేమ్ ఆడతున్నవారు అరగంటకోసారి లేదంటే గంటకోసారి బ్రేక్ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. లేదంటే కంటి చూపు దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు.