అంతర్జాతీయ క్రికెట్కు నెహ్రా గుడ్బై?

అంతర్జాతీయ క్రికెట్కు నెహ్రా గుడ్బై?

ప్రముఖ పేసర్‌ ఆశీష్‌ నెహ్రా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలక నున్నట్టు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. నెహ్రా నవంబర్‌ ఒకటి తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగాలనుకోవటం లేదని ఆయన అన్నారు. ఇదే జరిగితే రానున్న ఐపీఎల్‌ సీజన్‌లో సైతం నెహ్రా ఆడకపోవచ్చు. ఇటీవలే ఆసీస్‌తో టి20 సిరీస్‌కు నెహ్రా ఎంపికయ్యాడు. అయితే జరిగిన రెండు మ్యాచుల్లోనూ నెహ్రాకు తుది జట్టులో చోటు దక్కలేదు. 1999లో తొలిసారి భారత్‌ తరఫున మైదానంలో అడుగుపెట్టిన నెహ్రా ఇప్పటికి 17 టెస్టులు, 120 వన్డేలు సహా 26 టి20లు ఆడాడు.