సాహో స్టోరీ ఇదే… మీడియాలో చక్కర్లు…

సాహో స్టోరీ ఇదే… మీడియాలో చక్కర్లు…

బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. ఎన్నో అడ్డంకులు, అవాంతరాల మధ్య ఈ చిత్రం అక్టోబర్ 10న తొలి షెడ్యూల్ పూర్తి చేసుకొన్నది. తొలిసారి తెలుగులో నటిస్తున్న బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ ఉద్వేగానికి లోనైంది. తన మనసులోని మాటను ట్విట్టర్‌ ద్వారా బయటపెట్టింది. అంతేకాకుండా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

బ్రిటీష్ కాలం నాటి 
పునర్జన్మ నేపథ్యంగా

ఇక సాహో కథ విషయానికి వస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాహో సినిమా కథ పునర్జన్మ నేపథ్యంగా రూపొందుతుందట. రెండు వెర్వేరు కాలాల మధ్య కథ సాగుతుందట. తొలి షెడ్యూల్‌లో కొన్ని కనిపించిన సన్నివేశాల ప్రకారం.. బ్రిటీష్ కాలం నాటి వాతావరణం కనిపించిందట. షూటింగ్ స్పాట్‌లో బ్రిటీష్ జెండాలు ఉండటం ఆసక్తిని రేపుతున్నది.

తొలి షెడ్యూల్‌లో 
వందకు పైగా గుర్రాలు

తొలి షెడ్యూల్‌లో స్వాతంత్రానికి పూర్వం నాటి నేపథ్యంతో సీన్లను షూట్ చేసినట్టు సమాచారం. వందకు పైగా గుర్రాలు సెట్లో కనిపించాయి. ఓ భారీ యాక్షన్ సీన్‌ను ఇటీవల షూట్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రభాస్, శ్రద్ధా మళ్లీ పునర్జన్మ పొందుతారు అనే సాహో చిత్ర కథ అని చిత్ర యూనిట్ వర్గాల సమాచారం.

సాహో తొలి షెడ్యూల్ 
భావోద్వేగానికి గురైన శ్రద్దా

సాహో తొలి షెడ్యూల్ పూర్తయిన తర్వాత భావోద్వేగానికి గురైన శ్రద్దా ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టింది. సాహో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకొన్నాం. ప్రభాస్‌తోపాటు చిత్ర యూనిట్‌తో అద్భుతమైన టైమ్‌ను ఎంజాయ్ చేశాను. హైదరాబాద్ సొంత పట్టణంలా అనిపించింది అని ట్విట్టర్‌లో పేర్కొన్నది.

సొంత ఊరులా హైదరాబాద్ 
హైదరాబాద్ ప్రజలు నన్ను

హైదరాబాద్ సొంత ఊరులా అనిపించింది. హైదరాబాద్ ప్రజలు నన్ను ప్రజలు సొంత మనిషిలా చూసుకొన్నారు. వారందరిని మిస్ అవుతున్నందుకు బాధగా ఉంది. త్వరలోనే సెకండ్ షెడ్యూల్‌లో కలుసుకొంటాను అని శ్రద్ధా ట్వీట్ చేసింది.

సాహో షూటింగ్ 
సైనా బయోపిక్‌లో శ్రద్దా

తొలి షెడ్యూల్‌ జరుగుతున్న సందర్భంగా శ్రద్ధా కపూర్‌ను ప్రముఖ బాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ కలుసుకొన్నారు. సైనా బయోపిక్‌లో శ్రద్దా నటిస్తున్న సంగతి తెలిసిందే. సాహో షూటింగ్ వచ్చిన సైనా నెహ్వల్ ప్రభాస్, శ్రద్ధాలను కలుసుకొన్నారు.