పేరు మార్చుకున్న సమంత…

పేరు మార్చుకున్న సమంత…

స్టార్ హీరోయిన్ సమంత తన పేరు మార్చుకున్నారు. అలాగని వేరే పేరు పెట్టుకోలేదండోయ్. సోషల్ మీడియా సైట్ ట్విట్టర్‌లో ‘సమంత రుతు ప్రభు’గా ఉన్న తన పేరును ‘సమంత అక్కినేని’గా మార్చుకున్నారు. ఇటీవల అక్కినేని వారబ్బాయి, నటుడు నాగచైతన్య, సమంతల వివాహం హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో ఘనంగా నిర్వహించారు. అక్కినేని, రామానాయుడు, సమంతల కుటుంబాలతో పాటు కొందరు సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరైన విషయం తెలిసిందే. పెళ్లయిన రెండు రోజుల్లోనే ట్విట్టర్‌లో ప్రత్యక్షమై తనకు శుభాకాంక్షలు తెలిపిన వారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.

తాజాగా తన భర్త నాగచైతన్య ఇంటిపేరును తన పేరుకు జత చేసుకున్నారు. ట్విట్టర్‌లో సమంత రుతు ప్రభుగా ఉన్న పేరును సమంత అక్కినేనిగా మార్చుకోవడంపై సోషల్ మీడియాలో ఆమె అభిమానులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు కింగ్ నాగార్జున, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన రాజుగారి గది 2 ఈ శుక్రవారం విడుదల కానుంది. ఓంకార్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నాగార్జున మెంటలిస్ట్ పాత్రలో, సమంత ఆత్మగా కనిపించనున్నారు. త్వరలోనే సమంత రంగస్థలం 1985, సావిత్రి మూవీ షూటింగ్‌లతో మళ్లీ బిజీ కానున్నారు.