మన ‘ఎన్టీఆర్ బయోపిక్’ ఇప్పుడు హిందీలో కూడా…

మన ‘ఎన్టీఆర్ బయోపిక్’ ఇప్పుడు హిందీలో కూడా…

మాజీ ముఖ్య మంత్రి, మహానటుడు ఎన్టీఆర్ జీవితాన్ని బయోపిక్‌గా తెరకెక్కించేందుకు ఆయన తనయుడు బాలకృష్ణ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు తేజ ఈ ప్రాజెక్టును హ్యాండిల్ చేయబోతున్నాడు.

ఈ సినిమా చేస్తున్నట్లు తేజ అఫీషియల్ గా ప్రకటించడంతో పాటు, జనవరి నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఎన్టీఆర్ బాల్యం, సినిమా, రాజకీయ రంగాల్లో ఎదిగిన తీరు, తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవ ఈ చిత్రంలో చూపించబోతున్నారు.

నందమూరి బాలకృష్ణ 
ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య

తన తండ్రి జీవితంపై తీయబోయే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో బాలయ్యే నటించబోతున్నారు. బాలయ్య చెప్పిన వివరాలతోనే తేజ స్క్రిప్టు వర్క్ సిద్ధం చేశాడు. ఇప్పటికే బాలయ్యతో ఆయన నాలుగైదు సిట్టింగ్స్ వేసి స్క్రిప్టుకు సంబంధించి వర్క్ చేశారు.

బాలీవుడ్లో కూడా… 
హిందీలో కూడా

ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ భాషలో కూడా తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ కూడా ఖరారు చేశారు.

ఎన్టీఆర్ బయోపిక్‌లో 
నాన్నగారి జీవిత సారాంశం

‘ఎన్టీఆర్ బయోపిక్‌లో నాన్నగారి జీవిత సారాంశం ఉంటుంది. సినిమా ఎక్కడ మొదలు పెడతారు. ఎక్కడ ముగిస్తారు. కాంట్రవర్సీలు ఉంటాయా? ఇలా చాలా అడుగుతున్నారు. ఎక్కడ మొదలు పెట్టాలో, ఎక్కడ ముగించాలో నాకు తెలుసు అని అలా అడుగుతున్న వారి అందరి నోరు ఒకే దెబ్బతో మూయించా.’ అని బాలయ్య గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు అన్నారు.

వాగుతాడో వాడికి 
పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకోను

నాన్నగారి బయోపిక్ అయినా లేదా ఇంకేదైనా….. నా ముందు లిమిట్ లో మాట్లాడాలి. అదిదాటి ఎక్కువ వాగితే అయిపోయారే వాళ్లు. ఎవడు వాగుతాడో వాడికి దబ్బిడిదిబ్బిడే. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకోను అని బాలయ్య ఇంతకు ముందో ఓసారి స్పష్టం చేశారు.