కొడుకు జాతకం తెలుసుకొని సంతోషపడుతున్నా పవన్…

కొడుకు జాతకం తెలుసుకొని సంతోషపడుతున్నా పవన్…

పవన్ కళ్యాణ్ మూడో భార్య ఇటివలే మగ బిడ్డకు జన్మనించిన విషయం తెలిసిందే. మరో పవర్ స్టార్ వచ్చాడని పవన్ కళ్యాణ్ చాలా ఆనందంగా ఉన్నాడట. అయితే పవన్ కళ్యాణ్ తన కుమారుడు జాతకం తెలుసుకొని షాక్ అయ్యాడట. ఉదయం 10.32 నిమిషాలకు హైదరాబాద్‌లో కొడుకు పుట్టాడు.

అతని జాతకంలో వృషభంలో చంద్రుడు ఉండటంతో జన్మ నక్షత్రం రోహిణీ నక్షత్రం నాలుగో పాదం.. రాశి వృషభ రాశి.. లగ్నం వృశ్చిక లగ్నం.. రాహువు కర్కాటకంలో ఉన్నాడు. చంద్రుడు వృషభంలో ఉన్నాడు. అలాగే కుజుడు సింహంలో ఉన్నాడు. సూర్యుడు, బుధుడు, శుక్రుడు కన్యారాశిలో ఉన్నారు. జాతకం ప్రకారం ఎప్పుడైనా బృహస్పతి ప్రత్యక్షంగానీ కాని పరోక్షంగా గాని సంజీవుడితో కారకుడైనా శుక్రుడితో సంబంధం పెట్టుకుంటే అద్భుతమైన ఆయుష్షు లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆలోచనా విధానం అద్భుతంగా ఉంటుంది.

అంతేకాకుండా లోతైన ఆలోచవరుడిగా కూడా ఉంటాడట. మనస్సు ఆధ్మాత్మిక విషయాలు, తత్వవేత్తగా ఉంటారు. అమోఘమైన తెలివితేటలు ఉంటాయి.

తల్లి మాట అస్సలు వినడు. తండ్రి అంటే గౌరవం ఉంటుంది. ఈ విషయాలు తెలుసుకొని పవన్ తెగ సంతోషపడుతున్నాడట. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్..
త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.