ఆమ్రపాలి ట్రెక్కింగ్‌ వెనుక అసలు నిజాలివే!

ఆమ్రపాలి ట్రెక్కింగ్‌ వెనుక అసలు నిజాలివే!

వరంగల్ అర్బన్ కలెక్టర్‌గా ప్రతి సన్నివేశం తనకు మెమరిబుల్ అంటున్న ఆమ్రపాలి దూకుడు పెంచారు. సరికొత్త సాహసాలతో సంచనాలు సృష్టిస్తున్నారు. తాజాగా జిల్లాలోని దేవునూరు ఇనుప గుట్టల్లో ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో జరిగిన ట్రెక్కింగ్‌ నిర్వహించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ట్రెక్కింగ్‌లో ఆమె ఉత్సాహంగా పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగుంట మండలంలోని పాండవుల గుట్టల్లో చెకచెక ఎక్కేశారు. రాక్ క్లైబింగ్ అనేది అంత ఆషామాషీ కాదు. అందులోనూ కలెక్టర్ లాంటి కీలక పదవిలో ఉన్న ఒక మహిళ ఇలా రాక్ క్లైబింగ్ అప్పట్లో వార్తల్లో నిలిచిపోయింది. అయితే ఆమ్రపాలి ఈ సహాసకృత్యాలను ఫ్యాషన్ కోసమో సరదా తీర్చుకోవడం కోసం మాత్రమే చేయటం లేదు.

ఆమె అసలు ఇంటెన్షన్ తెలిస్తే ఆమ్రపాలి గొప్పతనం ఏమిటో తెలుస్తుంది. స్థానికంగా ఉన్న టూరిస్ట్ ప్రదేశాలను వార్తల్లోకి తీసుకురావటం.. పర్యాటకుల దృష్టిని ఆకర్షించడం కోసం ఆమె స్వయంగా సాహసకృత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ధర్మసాగర్ ఇనుపరాతి గుట్టల్లో ట్రెక్కింగ్‌కు ప్రాచుర్యం కల్పించడం.. పర్యాటకంగా అభివృద్ధి చేయడం కోసం సాహసకృత్యం ప్రదర్శించారు. సాహసకృత్యాలకు మాత్రమే కాదు ఆమ్రపాలి ఏం చేసిన ట్రెండే. సాధారణంగా రాజకీయ వేత్తలకు, సినీ తారలకు ఉండే ఫాలోయింగ్ ఆమె సొంతం. నడతలోను, నడకలోనూ, స్టైలిష్‌గా ఉండటం ఆమ్రపాలి స్పెషాలిటి. మోడ్రన్‌గా జీన్స్, టీ షర్ట్‌లో కనిపించిన.. సంప్రదాయంగా చీరలో కనిపించిన అట్రాక్టివ్‌గా కనిపించటం ఆమ్రపాలికే సాధ్యం. అందుకే ఆమె పేరిట అభిమానులు పదుల సంఖ్యలో ఫేస్‌బుక్ పేజీలను నిర్వహిస్తున్నారు. ఈ ఫేస్‌బుక్ పేజీలకు వేల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు.