బైటికొచ్చి చూస్తే టైమేమో 3’o క్లాక్‌!

పవన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌తో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలోని తొలి పాటను చిత్ర బృందం మంగళవారం విడుదల చేసింది. దర్శకుడు త్రివిక్రమ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని పాట లిరికల్‌ వీడియోను విడుదల చేశారు.

పాట వీడియోను కార్టూన్‌ లిరిక్స్‌తో డిజైన్‌ చేశారు. ‘బైటికొచ్చి చూస్తే టైమేమో 3’o క్లాక్‌..’ అంటూ సాగుతున్న ఈ పాట ఆకట్టుకుంటోంది. పాట విడుదలకి ముందే ట్విటర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్‌కి జోడీగా కీర్తి సురేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ నటిస్తున్నారు.

ఈ చిత్రానికి ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ కానీ టీజర్‌ కానీ విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఆ తర్వాత పవన్‌ పుట్టినరోజు సందర్భంగానైనా సర్‌ప్రైజ్‌ చేస్తారేమోనని అభిమానులుఎదురుచూశారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఇప్పుడు అనుకున్నట్లే త్రివిక్రమ్‌ పుట్టినరోజుకి చిత్రంలోని తొలి పాటను విడుదల చేశారు.

హారిక-హాసిని క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 2018 జనవరిలో ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.