వైఎస్ జగన్ నేటి ‘ప్రజా సంకల్ప యాత్ర’ షెడ్యూల్

వైఎస్ జగన్ నేటి ‘ప్రజా సంకల్ప యాత్ర’ షెడ్యూల్

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తలపెట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ మంగళవారం రెండో రోజు జరగనుంది. రెండో రోజు పాదయాత్రకు సంబంధించి షెడ్యూల్‌ను ఆ పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా జగన్ పాదయాత్ర ఈ నెల 13 వరకు కడప జిల్లాలోనే సాగనుంది. కడపలో ముగిసిన అనంతరం కర్నూలు జిల్లాలో పాదయాత్ర జరగనుంది.

వివరాలు

 • ఉదయం 8.30 గంటలకు వేంపల్లి శివారులోని బస నుంచి జగన్ పాదయాత్ర
 • 9.05 గంటలకు రవి పెట్రోల్ బంకు వద్ద ప్రజలు స్వాగతం పలుకుతారు.
 • 9.50 గంటలకు వేంపల్లె నాలుగు రోడ్లకూడలిలో జగన్ పార్టీ జెండా ఆవిష్కరిస్తారు.
 • 11.10 గంటలకు శ్రీనివాసకళ్యాణ మండపంలో ప్రజలతో ముఖాముఖి.
 • 11.35 గంటలకు బైపాస్ రోడ్డులోని ఆలయంలో పూజలు.
 • 12 గంటలకు వైఎస్సార్ కాలనీలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేస్తారు
 • 12.20 గంటలకు కడప-పులివెందుల మార్గంలో మధ్యాహ్న భోజన విరామం
 • మధ్యాహ్నం 3.30 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభం
 • 3.45 గంటలకు సర్వరాజుపేట గ్రామానికి జగన్ చేరుకుంటారు.
 • సాయంత్రం 5.20 గంటలకు గాలేరు-నగరి కాలువ పరిశీలన
 • రాత్రి 8.30 గంటలకు ప్రొద్దుటూరు రోడ్డులోని నేల తిమ్మాయపల్లి వద్ద ఏర్పాటు చేసిన బసకు వైఎస్ జగన్ చేరుకుంటారు.

జగన్ పాదయాత్ర విశేషాలు మీకోసం…

Related Images: