రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ రచ్చ రంబోలానే..!!

రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ రచ్చ రంబోలానే..!!

రాజమౌళి సినిమా అంటేనే ఓ అద్భుతం. తెలుగువాడి సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన దర్శక ధీరుడు. అందుకే జక్కన్న సినిమా అంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తారు. సినిమాకు సంబంధించి ప్రతి అప్ డేట్ అభిమానులకు తెలియజేస్తూ.. సినిమాపై టెంపో తగ్గకుండా చూడడంలో రాజమౌళి రూటే వేరు. అలాంటి రాజమౌళి.. తొలిసారి మల్టీ స్టారర్ తీయబోతున్నాడనే వార్త ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనం రేపుతోంది.

బాహుబలి తర్వాత రాజమౌళి తీయబోయే సినిమా ఏంటన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. చిన్న సినిమా చేస్తారని కొందరు, బాలీవుడ్ కు వెళ్లిపోతారన మరికొందరూ ఊహించారు. అయితే అందరి ఆలోచనలకు భిన్నంగా మన జక్కన్న మల్టీస్టారర్ మూవీని భుజానికెత్తుకోబోతున్నాడు. ఎవరూ ఊహించని కాంబినేషన్ ను కలపబోతున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిపి భారీ మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నారు.

రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో మూవీ అంటే ఫ్యాన్స్ లో ఎంత క్రేజ్ ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ అందరూ సినిమాపై అంచనాలు పెంచేసుకుంటారు. అందుకే వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. లేకపోతే ఫ్యాన్స్ రెచ్చిపోతారు. ఇలాంటి ఇగోలున్న టాలీవుడ్ లో రాజమౌళి.. ఎలాంటి స్టోరీ ఎంచుకుంటాడు అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

ఎప్పుడూ ఊహలకి భిన్నంగా వ్యవహరించే రాజమౌళి.. ఈసారి కూడా అదే చేశాడు. చెర్రీ, ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న మూవీని స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తీయబోతున్నారన్నది లేటెస్ట్ టాక్. మూవీలో చరణ్, ఎన్టీఆర్ బాక్సర్లుగా కనిపిస్తారట. అయితే ఈ మూవీలో రాజమౌళి గత సినిమాలకు భిన్నంగా ఎలాంటి గ్రాఫిక్స్ ఉండవని తెలుస్తోంది.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో మూవీ అయినా.. ఫ్యామిలీ సెంటిమెంట్ పండే విధంగా మూవీ ఉంటుందని ఇండస్ట్రీ టాక్. రియల్ స్టోరీ ఆధారంగా సినిమా ఉంటుందని తెలుస్తున్నా.. ఎవరి గురించి అన్నది మాత్రం బయటకు రాలేదు. ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీస్ అంటే ఇంట్రస్ట్ చూపించని రాజమౌళి.. మరి ఈ ఫ్యామిలీ స్టోరీని ఎలా డాల్ చేస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

2018లో ఈ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. 2018, అక్టోబర్ లో సినిమా ప్రారంభమవుతుందని రాజమౌళి సన్నిహితులు చెబుతున్నారు. పక్కాగా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న తర్వాతే రాజమౌళి.. సెట్స్ పైకి సినిమా తీసుకెళ్తాడట. అంతే కాదు.. ఫస్ట్ షాట్ తారక్ పైనే ఉంటుందని ఇండస్ట్రీలో టాక్..