ఎంసీఏ ట్రైలర్

వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న నాని.. ఫిదా లాంటి క్లాస్ హిట్‌ అందుకున్న సాయిపల్లవి జంటగా వేణుశ్రీరాం దర్శకత్వంలో నటిస్తోన్న మూవీ ఎంసీఏ(మిడిల్ క్లాస్ అబ్బాయ్). టీజర్, నాని లుక్స్, లిరికల్ వీడియోలతో ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు పెంచేసిన దిల్‌రాజు.. తాజాగా ఎంసీఏ ట్రైలర్‌ను రిలీజ్ చేశాడు. “వదినకి వరంగల్‌కు ట్రాన్స్‌ఫర్ అయ్యింది రా.. నువ్వు వెళ్లాలి అంటూ” రాజీవ్ కనకాల వాయిస్‌తో ట్రైలర్ స్టార్టవుతుంది.

దీన్ని బట్టి చూస్తుంటే ఇది వదిన-మరిదిల కథ అని రాజుగారు హింట్ ఇచ్చేసినట్లు అర్థమవుతోంది. ఇంట్లో వదినదే పెత్తనమని.. ఆ ఫస్ట్రేషన్‌ను ఎలా తీర్చుకోవాలో తెలియక పిన్నితో తన బాధను చెప్పుకుంటాడు హీరో. ఈ నేపథ్యంలో వదినకి ఓ సమస్య వస్తుందని.. దానిని హీరో ఎలా తీర్చుకుంటాడన్నదే ఎంసీఏ కథగా తెలుస్తోంది.
దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.. సీనియర్ హీరోయిన్ భూమిక ఈ మూవీలో నానికి వదినగా నటిస్తోంది. ఈ నెల 16న ఎంసీఏ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తుండగా.. 21న మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు దిల్‌రాజు.

Related Images: