చరిత్రలో ఒకే ఒక్కడు రో’హిట్’ శర్మ

చరిత్రలో ఒకే ఒక్కడు రో’హిట్’ శర్మ

టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ లంకేయులకు చుక్కలు చూపించాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో రోహిత్‌ శర్మ (208 నాటౌట్‌) దుమ్మురేపాడు. వన్డేల్లో మూడో డబుల్‌ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. తనకు తానే సాటి అని చాటిచెప్పాడు. అతడికి శ్రేయస్‌ అయ్యర్‌ (88, శిఖర్‌ ధావన్‌ (68;) అర్ధశతకాలతో సహకారం అందించడంతో టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 392 భారీ పరుగులు చేసింది.Image result for rohit sharma

తొలి మ్యాచ్‌లో దారుణంగా విఫలమై కెప్టెన్‌గా చెత్త రికార్డు మూటగట్టుకున్న రోహిత్‌ అంతకంతకు లంక బౌలర్లపై బదులు తీర్చుకున్నాడు. రోహిత్ బాదుడుకి ఏం చేయాలో లంక బౌలర్ల అర్ధం కాలేదు. ప్రతి బంతిని ఉతికి ఆరేశాడు. పట్టపగలే చుక్కలు చూపించాడు. లంక బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ డబుల్ సెంచరీతో చరిత్రలో ఒకడిగా నిలిచాడు రోహిత్.