విరుష్కల వివాహం అందుకే రహస్యంగా జరిగిందా..?

విరుష్కల వివాహం అందుకే రహస్యంగా జరిగిందా..?

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, నటి అనుష్కశర్మల వివాహం సోమవారం గుట్టుచప్పుడు కాకుండా జరిగింది. ఎన్నో పుకార్లు, వదంతుల నడుమ ఈ ప్రేమ జంట వివాహం ఇటలీలోని టస్కనీలో వైభవంగా జరిగింది. అయితే ఎవరికి సమచారం ఇవ్వకుండా.. అతిథులను ఎక్కువగా ఆహ్వానించకుండా.. ‘విరుష్క’లు ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని ప్రస్తుతం చాలా మందికి అనుమానాలు వస్తున్నాయి. అయితే వీటికి సమాధానంగా కొన్ని ఆసక్తికర వార్తలు కూడా పుట్టుకొస్తున్నాయి.

శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్ వెంటనే విరాట్ తనకు విరామం కావాలని వన్డే, టీ-20 సిరీస్‌ల జట్టు నుంచి తప్పుకున్నాడు. ఇది జరిగిన తర్వాతి రోజే అనుష్క తన కుటుంబంతో సహా ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చింది. అయితే వీరిద్దరు వివాహం చేసుకొనేందుకే వెళ్తున్నారని మీడియాలో కథనాలు ప్రసారం కావడంతో అవీ పుకార్లే అని అనుష్క ప్రతినిధి పేర్కొన్నారు. కానీ ముందు అనుకున్న విధంగానే వీరిద్దరు ఒకటయ్యారు. అంతేకాక.. తమ వివాహానికి సంబంధించిన ఫోటోలను స్వయంగా ట్వీట్ చేశారు.

మరీ ఇంత పాపులారిటీ ఉన్న ఈ జంట రహస్యంగా వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనే ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. ప్రపంచంలో ఎన్నో ప్రదేశాలు ఉండగా.. వీళ్లు ఇటలీలో వివాహం చేసుకోవడానికి కారణం బాలీవుడ్ దర్శక నిర్మాత ఆదిత్య చోప్రానేనట. అనుష్కను బాలీవుడ్‌కి పరిచయం చేసిన ఆయనే విరాట్-అనుష్కలు వివాహం కోసం ఏర్పాట్లు చేసుకంటున్న సమయంలో ఇటలీలో వివాహం చేసుకోమని సూచించారట.

అంతేకాక తాజాగా ఆంగ్ల మీడియా కథనం ప్రకారం వివాహ వేడుక ద్వారా వచ్చే అదాయం కలిసొస్తుందని విరాట్, అనుష్కలు విదేశంలో వివాహం చేసుకన్నట్లు సమచారం. అయితే ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో లేదో తెలీదు. అయితే వివాహానికి ఎవరిని ఆహ్వానించకపోయాను.. బాలీవుడ్, క్రికెట్ ప్రముఖల కోసం విరుష్క జంట 21న ఢిల్లీలో, 26న ముంబయిలో రిసెప్షన్ వేడుక ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.