విజయ్ సాయి..చివరిగా భార్యతో ఏమన్నాడో తెలుసా..!

విజయ్ సాయి..చివరిగా భార్యతో ఏమన్నాడో తెలుసా..!

హాస్య నటుడు విజయ్ సాయి ఆత్మహత్య కేసు ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో సాగుతోంది. విజయ్ మరణానికి అతడి భార్య వనితా రెడ్డే కారణం అని విజయ్ తల్లిదండ్రులు ఆరోపిస్తుంటే.. విజయ్ మరణంతో తనకెలాంటి సంబంధం లేదంటున్నారు ఆమె భార్య వనితా రెడ్డి. తన వల్లే విజయ్ మరణించాడనే ఆరోపణలు ఖండిస్తూనే.. పలు సంచలన కామెంట్స్ చేశారు. సంఘటన స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న విజయ్ ఫోన్‌లో సెల్ఫీ వీడియోను గుర్తించారు. దీంతో సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అయితే అతను చివరిసారిగా భార్యతో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో టేపు ఒకటి బయటికి వచ్చింది. అందులో తన చివరి కోరికను విజయ్ వెల్లడించాడు. భార్యతో కలిసి రెండ్రోజులు హ్యాపీగా ఉండాలనేది అతని చివరి కోరిక. తన వ్యక్తి గత జీవింతం గురించి ఇకముందు పట్టించుకోనని..తాను ఎంచుకున్న దారిలో ముందు ముందు ఎదురయ్యే సమస్యల గురించి చెప్పాడు.

అంతే కాదు నీ జీవితం నీ ఇష్టం..ఇక ముందు కనీసం నీకు మిస్ కాల్ కూడా ఇవ్వనని విజయ్ అన్నారు. ఒక్క పదిహేను నిమిషాలు కలిసి మాట్లాడుకుందామని భార్య వనితా రెడ్డిని విజయ్ కోరాడు. వనిత ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, టెన్షన్‌గా జీవించవద్దని, ఇక తన జీవితంలోకి అడ్డురానని విజయ్ చెప్పాడు. అలాగే వారి జీవితంలోకి మూడో వ్యక్తి ఎంటర్ అవ్వడం వల్ల తమ జీవితాలు చెల్లాచెదురయ్యాయని విజయ్ పేర్కొన్నాడు.