విచిత్రమైన పరిస్థితుల్లో విజయ్ దేవరకొండ

విచిత్రమైన పరిస్థితుల్లో విజయ్ దేవరకొండ

ఒకే ఒక సినిమాతో టాలీవుడ్‌లో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఆ యువ కథానాయకుడు ఇప్పుడో సీనియర్ తమిళ దర్శకుడి సినిమా నుంచి తప్పుకున్నాడట.

ఎలాంటి అవకాశాలు రానప్పుడు దర్శకుడు చిన్నవాడా, పెద్ద వాడా అని చూసే అవకాశం ఉండదు. అదే వరుస ఆఫర్స్ ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటే ఎంతటి పెద్ద దర్శకుడి సినిమాకయినా డేట్లు సర్దుబాటు చేసే అవకాశముండదు. అలాంటి ఒక విచిత్రమయిన పరిస్థితుల్లో చిక్కుకున్నాడు దేవరకొండ విజయ్.

‘అర్జున్ రెడ్డి’ విజయంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన దేవరకొండ విజయ్ ఇప్పుడు మణిరత్నం సినిమానే పక్కన పెట్టే స్థాయికి వెళ్ళిపోయాడని చెప్పుకుంటున్నారు. అసలు విషయమేంటంటే.. విజయ్ దేవరకొండ హీరోగా మణిరత్నం ఒక సినిమా ప్లాన్ చేశాడట. తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కించాలని మణిరత్నం ప్లాన్. అందులో తెలుగు వెర్షన్ కోసం విజయ్ దేవరకొండని హీరోగా అనుకున్నాడట.

స్టోరీ నెరేషన్, డేట్లు ఫిక్స్ చేసుకోవడం లాంటివన్నీ పూర్తయ్యాయట. కానీ చివరి నిమిషంలో విజయ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడట. దాంతో విజయ్ స్థానంలో మరొకరిని తీసుకొనే ప్రయత్నంలో ఉన్నాడట మణిరత్నం. ‘అర్జున్ రెడ్డి’తో తన ఇమేజ్ ఎన్నోరెట్లు పెరిగింది కాబట్టి ఒప్పుకున్న సినిమాలకు డేట్స్ సర్దుబాటు చేయలేక విజయ్ మణిరత్నం సినిమా అయినా సరే పక్కన పెట్టాడట. మణిరత్నం లాంటి పెద్ద దర్శకుడి సినిమానే వదలుకున్న విజయ్ దేవరకొండ తన నిర్ణయంతో అందరికీ షాకిస్తున్నాడు. మరి మణిరత్నం విజయ్ స్థానాన్ని ఇంకెవరితో భర్తీ చేస్తాడో చూడాలి.