‘అజ్ఞాతవాసి’ ఆడియో ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా..!

‘అజ్ఞాతవాసి’ ఆడియో ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా..!

తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాన్. మొదట్లో పెద్దగా విజయాలు వరించక పోయినా…తొలిప్రేమ, తమ్ముడు, ఖుషి సినిమాలతో ఒక్కసారే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇక జల్సా, గబ్బర్ సింగ్ లాంటి సినిమాలతో పవన్ కళ్యాన్ స్టార్ డమ్ ఎక్కడికో వెళ్లిపోయింది. వాస్తవానికి పది సంవత్సరాల క్రితం చిరంజీవి సినిమాలకు దూరం కావడం..ఆయన వారుసలుగా బన్ని, చరణ్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చినా..పవన్ కళ్యాన్ కే మెగా అభిమానులు కనెక్ట్ అయ్యారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో తన మాటలతో మాయ చేస్తూ..మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలే దాదాపు అన్ని హిట్టే అని చెప్పాలి. త్రివిక్రమ్- పవన్ కళ్యాన్ కాంబినేషన్ లో వచ్చిన ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో ‘అజ్ఞాతవాసి’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఆడియోను ఈ నెల 19న లాంచ్ చేయనున్నారు. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ ఈ కార్యక్రమానికి వేదిక కానుంది.

గత కొన్ని రోజులుగా ఈ సినిమా పై ఎలాంటి అప్ డేట్స్ లేకుండా చాలా జాగ్రత్త పడ్డ చిత్ర యూనిట్ ఇప్పుడు ఫస్ట్ లుక్, సాంగ్ రిలీజ్ చేయడమే కాకుండా త్వరలో ట్రైలర్ కూడా రిలీజ్ చేయడానికి సిద్దంగా ఉన్నారు. అయితే ‘అజ్ఞాతవాసి’ ఆడియో వేడుకకు పవన్ అన్నయ్య చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ లు ఒకే వేదికపైకి రానుండటం మెగా ఫ్యాన్స్ కు పండగే. ఆ మద్య సర్ధార్ గబ్బర్ సింగ్ ఫంక్షన్లో చిరు చేసిన సందడి అంతా ఇంతా కాదు..దాంతో అప్పటి వరకు ఉన్న వారిద్దరి మద్య రూమర్లు పటాపంచలు అయ్యాయి.

ఇప్పుడు మరోసారి చిరంజీవి, పవన్ కల్యాణ్ లు ఒకే వేదికపైకి రానుండటం మెగా ఫ్యాన్స్ కు పండగే. పవన్ కల్యాణ్ 25వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.