అండర్‌ 19 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ స్కోర్

అండర్‌ 19 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ స్కోర్

అండర్‌ 19 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు త్వరగా వికెట్లు కోల్పోతోంది. స్వల్ఫ వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. హ్యాడ్లీ(1) రన్‌ అవుట​ గా వెనుదిరిగాడు.  ఎన్సన్స్‌(1) పరుగు చేసి నాగర్‌ కోటి బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. మరోవైపు హాఫ్‌ సెంచరీతో రాణించిన మెర్లో 76 పరుగులు వద్ద అవుటయ్యాడు. రోయ్‌ బౌలింగ్‌లో శివసింగ్‌ కు మెర్లో క్యాచ్‌ ఇచ్చాడు.

ప్రస్తుతం ఆసీస్‌ స్కోర్‌ 9 వికెట్ల నష్టానికి 216 పరుగులు.  ప్రస్తుతం క్రీజులో క్రీజులో పోప్‌, హ్యాడ్లీ ఉన్నారు. 

మౌంట్‌మాంగనీలో జరుగుతున్న అండర్‌-19 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా-ఆసీస్‌ జట్లు తలపడుతున్నాయి. టాస్‌ గెలిచి ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లు ఎడ్వర్డ్స్‌, బ్రయాంట్‌లు, తర్వాత వచ్చిన సంఘ కూడా తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు.  ఉప్పల్‌ 34 పరుగులు, షరమ్‌ స్వీనే(23 పరుగులు) సాధించారు. భారత బౌలర్లలో ఇషాన్‌కు రెండు వికెట్లు, శివ సింగ్‌కు రెండు, నగర్‌కోటి, రోయ్‌కు ఓ వికెట్‌ దక్కాయి.

Related Images: