రాజకీయాల్లోకి V V వినాయక్..!

రాజకీయాల్లోకి V V వినాయక్..!

సిని గ్లామర్ కు పాలిటిక్స్ అన్నది కొత్తేమి కాదు.. సినిమా సెలబ్రిటీస్ గా క్రేజ్ వచ్చాక రాజకీయాల్లోకి రావడం కామన్. ఎన్.టి.ఆర్ దగ్గర నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరకు అలా చేసిన వారే.. అయితే కొందరు మాత్రంరాజకీయ ప్రక్షాళణ అన్నట్టు కాకుండా ఉన్న పార్టీల్లోనే ఏదో ఒక దానిలో చేరుతారు.

ముఖ్యంగా దర్శక నిర్మాతలు ఈ విధంగా చేస్తుంటారు. ఇక ఎన్నాళ్ల నుండో మాస్ అండ్ కమర్షియల్ డైరక్టర్ వి.వి.వినాయక్ రాజకీయాల్లోకి వస్తానని వార్తలు వచ్చాయి. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాబట్టి వినాయక్ గురించి ఇలాంటి వార్తలు రావడం కామన్. అయితే ఈ కామెంట్స్ పై వినాయక్ నోరు విప్పాడు.

తాను డైరక్టర్ అవుతానని అనుకోలేదు అలా జరిగింది.. రాజకీయాల్లోకి కూడా వెళ్లాలని ఆలోచనలేదు.. ఒకవేళ అలానే కుదిరితే అదే చేస్తా అంటూ తన రాజకీయ ప్రవేశంపై ఓ క్లారిటీ ఇచ్చాడు వినాయక్. స్టార్ డైరక్టర్ కాబట్టి వినాయక్ ఏ పార్టీలో చేరుతాడు అన్న డిస్కషన్స్ కూడా మొదలు పెట్టారు నెటిజెన్లు. కొందరు టిడిపి, మరి కొందరు వైసిపి అంటుంటే మెగా ఫ్యామిలీ అభిమానంతో జనసేనలో చేరుతాడని కొందరు అంటున్నారు.

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడే వినాయక్ కు సీట్ ఇస్తారని అనుకున్నారు కాని అలా జరుగలేదు. వినాయక్ పొలిటికల్ ఎంట్రీ ఇంట్రెస్టింగ్ గా మారిన ఈ సందర్భంలో ఆయన ఏ పార్టీకి ఓకే చెబుతారు అన్నది సందిగ్ధంగా మారింది. 2019 ఎన్నికల్లో వినాయక్ ఏదో ఒకచోట నుండి పొటీ చేస్తాడని ఫిల్మ్ నగర్ టాక్.

Related Images: