ధనుష్‌ నటించిన హాలీవుడ్‌ టీజర్‌ మీకోసం..!

ధనుష్‌ నటించిన హాలీవుడ్‌ టీజర్‌ మీకోసం..!

సౌత్‌ ఇండియన్‌ స్టార్‌ ధనుష్‌ నటించిన హాలీవుడ్‌ చిత్రం టీజర్‌ వచ్చేసింది. ‘ద ఎక్స్టార్డనరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్’ చిత్రంలో ధనుష్‌ లీడ్‌ రోల్‌లో కనిపించబోతున్న విషయం తెలిసిందే. చిత్ర అనుభవాలను దర్శకుడు వివరిస్తుండగా.. ఓ బైట్‌ను విడుదల చేశారు. దీనిని ధనుష్‌ తన ఫేస్‌ బుక్‌ ఖాతాలో పోస్టు చేశారు. 

అజాతశత్రు లావాష్‌ పటేల్‌ పాత్రలో ధనుష్‌ ఇందులో కనిపించబోతున్నాడు. ముంబైకి చెందిన ఈ కుర్రాడికి లోకజ్ఞానం తెలీదు. ఉన్న ఊరును, కన్నతల్లిని విడిచి ఉండలేని పటేల్‌ కొన్ని పరిస్థితుల రిత్యా ప్రపంచ యాత్రకు బయలుదేరుతాడు. ఈ క్రమంలో అతను ఎదుర్కునే పరిస్థితులు.. సాహసాలు, మధ్యలో ప్రేమ కథ ఇలా సాగుతోంది సినిమా. ఎమోషనల్‌ అండ్‌ కామెడీ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కించినట్లు దర్శకుడు కెన్‌ స్కాట్‌ వివరించాడు. ధనుష్‌ లాంటి నటుడితో పని చేయటం నిజంగా మంచి అనుభూతినిచ్చిందని ఆయన తెలిపారు.

ధ‌నుష్ సరసన బెరనైస్‌ బెజో, అలెగ్జాండ్రా దడారియోలతో నటించారు. రొమైన్ ప్యూర్తొలా రాసిన ‘ద ఎక్స్‌ట్రార్డిన‌రీ జ‌ర్నీ ఆఫ్ ద‌ ఫ‌కీర్ హూ గాట్ ట్రాప్‌డ్ ఇన్ యాన్ ఐకియా వార్డ్‌రోబ్‌’ పుస్త‌కం ఆధారంగా కెనడియన్‌ స్క్రిప్ట్‌ రైటర్‌ కమ్‌ డైరెక‍్టర్‌ కెన్‌ స్కాట్‌ తెరకెక్కించారు. ఈ చిత్రం ఇండియా, ఫ్రాన్స్, ఇటలీ, లిబియాలో షూటింగ్ జరుపుకుంది. వివిధ దేశాల‌కు చెందిన టెక్నీషియ‌న్స్ ప‌నిచేసిన‌ట్టు ద‌ర్శ‌కులు తెలిపారు. మే 30న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంగ్లీష్‌తోపాటు ఫ్రెంచ్‌లోనూ ఈ చిత్రం విడుదల కానుంది.

Related Images: