దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి సిరీస్‌ గెలిచిన భారత్‌..!

దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి సిరీస్‌ గెలిచిన భారత్‌..!

దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి సిరీస్‌ గెలిచిన భారత్‌ ఐదో వన్డేలో కోహ్లీసేన ఘనవిజయం రోహిత్‌ శర్మ సెంచరీ పోర్ట్‌ ఎలిజబెత్‌నవంబరు మొదలు.. పాతికేళ్లుగా సఫారీ గడ్డకు వెళ్తోంది వస్తోంది టీమ్‌ఇండియా. ఏడు టెస్టు సిరీస్‌లయ్యాయి. ఏడు వన్డే సిరీస్‌లు ముగిశాయి. ఎన్నడూ ఏ ఫార్మాట్లోనూ భారత్‌ సిరీస్‌ విజేతగా నిలిచింది లేదు. అయితే ఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. కోహ్లీసేన కల నెరవేర్చింది. దక్షిణాఫ్రికాలో దక్షిణాఫ్రికాపై సిరీస్‌ విజయం సాధించిన తొలి భారత జట్టుగా నిలిచింది. ఆరు వన్డేల పోరులో తొలి మూడు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ విజయానికి చేరువగా వచ్చిన భారత్‌కు నాలుగో వన్డేలో ఎదురుదెబ్బ తగిలినా.. తర్వాతి మ్యాచ్‌లో గట్టిగానే పుంజుకుంది. ఐదో వన్డేలో ఆతిథ్య జట్టును 73 పరుగుల తేడాతో ఓడించి, మరో మ్యాచ్‌ మిగిలుండగానే 4-1తో సిరీస్‌ సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌ అగ్రస్థానం కూడా పదిలమైంది. తర్వాతి మ్యాచ్‌ ఓడినా నంబర్‌వన్‌ కొనసాగుతుంది.

India won the Series Against South Africa for the First Time in South Africa

మ్‌ ఇండియా చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి ఓ సిరీస్‌ను చేజిక్కించుకుంది. పేలవ ఫామ్‌ నుంచి బయటపడ్డ రోహిత్‌ శర్మ (115; 126 బంతుల్లో 11×4, 4×6) సెంచరీతో మెరిసిన వేళ.. మంగళవారం జరిగిన ఐదో వన్డేలో కోహ్లీసేన 73 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది.

ఆఖర్లో తడబాటుతో అనుకున్నన్ని పరుగులు చేయకపోయినా.. ఫీల్డింగ్‌లో పొరపాట్లు చేసినా.. చక్కని బౌలింగ్‌తో ఆతిథ్య జట్టును భారత్‌ చుట్టేసింది. రోహిత్‌ మెరవడంతో మొదట భారత్‌ 7 వికెట్లకు 274 పరుగులు సాధించింది.

ఛేదనలో హషీమ్‌ ఆమ్లా (71; 92 బంతుల్లో 5×4) పోరాడినా దక్షిణాఫ్రికాకు ఫలితం లేకపోయింది. పాండ్య (2/30), చాహల్‌ (2/43), కుల్‌దీప్‌ (4/57) విజృంభించడంతో ఆ జట్టు 42.2 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌటైంది. రోహిత్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. ఈ విజయంతో ఆరు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 4-1తో తిరుగులేని ఆధిక్యం సంపాదించింది.

ఐదు వన్డేల్లో 30 వికెట్లు తీసిన మణికట్టు స్పిన్‌ ద్వయం కుల్‌దీప్‌, చాహల్‌ సిరీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు.ఏ ఫార్మాట్లోనైనా దక్షిణాఫ్రికా గడ్డపై సిరీస్‌ గెలవడం టీమ్‌ ఇండియాకు ఇదే తొలిసారి. చివరిదైన ఆరో వన్డే శుక్రవారం సెంచూరియన్‌లో జరుగుతుంది. 

రాణించిన ఆమ్లా: మార్‌క్రమ్‌ ఇచ్చి ఓ క్యాచ్‌ను శ్రేయస్‌ అయ్యర్‌ వదిలి ఉండకపోతే ఎలా ఉండేదో కానీ.. ఛేదనలో దక్షిణాఫ్రికాకు మంచి ఆరంభమే లభించింది. మార్‌క్రమ్‌ ధాటిగా బ్యాటింగ్‌ చేయడంతో దక్షిణాఫ్రికా 9 ఓవర్లకు 51/0తో నిలిచింది.

కానీ పాండ్య విజృంభించడంతో భారత్‌ పైచేయి సాధించింది. మార్‌క్రమ్‌ (32; 32 బంతుల్లో 4×4, 1×6)ను ఔట్‌ చేయడం ద్వారా పతనాన్ని ఆరంభించింది మాత్రం బుమ్రానే. ఆ తర్వాత పాండ్య వరుస ఓవర్లలో డుమిని (1), డివిలియర్స్‌ (6)ను ఔట్‌ చేసి ఆతిథ్య జట్టును గట్టి దెబ్బతీశాడు. అత్యంత ప్రమాదకర డివిలియర్స్‌ ఔట్‌ కావడంతో భారత్‌కు మార్గం సుగమమైనట్లనిపించింది.

కానీ 65 పరుగులకే మూడు వికెట్లు చేజార్చుకున్న దక్షిణఫ్రికాను మరో ఓపెనర్‌ ఆమ్లా ఆదుకున్నాడు. ఓ వైపు వికెట్లు పోతున్నా పట్టుదలగా బ్యాటింగ్‌ చేసిన అతడు.. జట్టును లక్ష్యం దిశగా నడిపించడానికి ప్రయత్నించాడు. మిల్లర్‌ (36) అతడికి చక్కని సహకారాన్నిచ్చాడు.

ప్రమాదకరంగా మారుతున్న ఈ భాగస్వామ్యాన్ని (62) చాహల్‌ విడదీయడంతో భారత్‌ కాస్త ఊపిరిపీల్చుకుంది. అతడు మిల్లర్‌ను బౌల్డ్‌ చేశాడు. 

అదే మలుపు!: మిల్లర్‌ ఔటైనా క్లాసన్‌తో కలిసి ఆమ్లా జట్టును లక్ష్యం దిశగా నడిపించే ప్రయత్నం చేశాడు. 35వ ఓవర్లో దక్షిణాఫ్రికా 166/4తో నిలిచింది. సాధించాల్సిన రన్‌రేట్‌ పెరుగుతున్నా..

ఆమ్లాతో పాటు, గత మ్యాచ్‌లో చెలరేగిన క్లాసన్‌ క్రీజులో ఉండడంతో ఆతిథ్య జట్టు లక్ష్యం దిశగానే సాగింది. కానీ పాండ్య నేరుగా వేసిన త్రోకు ఆమ్లా రనౌట్‌ కావడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. అంతే ఆతిథ్య జట్టుపై భారత్‌ ఒత్తిడి పెంచేసింది. తర్వాతి ఓవర్లోనే ఫెలుక్వాయో (0)ను కుల్‌దీప్‌ బౌల్డ్‌ చేశాడు.

ఆ తర్వాత క్లాసన్‌ (39) కాస్త పోరాడినా దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌కు భారత్‌ తేలిగ్గానే తెరదించింది. 

ఎట్టకేలకు రోహిట్టు: భారత్‌ ఇన్నింగ్స్‌లో రోహిత్‌ ఆటే హైలైట్‌. వరుస వైఫల్యాలు చవిచూసిన అతడు.. ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. తనదైన శైలిలో చెలరేగిపోకున్నా..

విలువైన శతకం సాధించాడు. కానీ.. మరోసారి టాప్‌ రాణించినా, మిడిల్‌ ఆర్డరే భారత్‌ను నిరాశపరిచింది. ఓ దశలో 300పై సాధించేలా కనిపించిన భారత్‌..

మిడిల్‌ దెబ్బతో అనుకున్న దానికంటే తక్కువ స్కోరుకే సరిపెట్టుకుంది. కాస్త మందకొడిగా ఉన్న పిచ్‌పై టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు మంచి ఆరంభమే దక్కింది. ఎనిమిదో ఓవర్లో ధావన్‌ (34; 23 బంతుల్లో 8×4) ఔటయ్యేటప్పటికి స్కోరు 48. సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ ఎడాపెడా బౌండరీలు బాదిన ధావన్‌..

ఊపుమీదున్న దశలో రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. నెమ్మదిగా ఇన్నింగ్స్‌ ఆరంభించిన రోహిత్‌ శర్మ.. కుదురుకున్నాక వేగం పెంచాడు. ఎంగిడి బౌలింగ్‌లో స్క్వేర్‌ లెగ్‌లో ముచ్చటైన సిక్స్‌ కొట్టాడు.

మరోవైపు కోహ్లి నిలవడంతో.. పరుగులు ధారాళంగా రాకపోయినా ఇన్నింగ్స్‌ సాఫీగా సాగింది. రోహిత్‌ 50 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. 25 ఓవర్లకు 148/1తో భారత్‌ పటిష్ట స్థితిలో నిలిచింది.

కానీ బ్యాట్స్‌మెన్‌ సమన్వయ లోపంతో భారత్‌ అనవసరంగా రెండు వికెట్లు కోల్పోయింది. మోర్కెల్‌ బౌలింగ్‌లో సింగిల్‌ కోసం పిలిచిన రోహిత్‌ కాస్త ముందుకెళ్లాడు. వెంటనే పరుగు రాదని భావించి, వద్దని చెప్పి ఆగిపోయాడు. కానీ అప్పటికే కోహ్లి (36; 54 బంతుల్లో 2×4) చాలా దూరం వచ్చేశాడు.

వెనుదిరిగినా క్రీజులోకి సురక్షితంగా చేరుకునే అవకాశం లేకపోయింది. డుమిని అండర్‌ ఆర్మ్‌ త్రోకు అతడు ఔటయ్యాడు. కాసేపటి తర్వాత రహానె దాదాపుగా ఇలాగే రనౌటైయ్యాడు. అప్పటికి భారత్‌ పరుగుల వేగం కూడా బాగా తగ్గిపోయింది.

అయినా 32 ఓవర్లలో 180/3తో 300 దాటడానికి భారత్‌కు మంచి అవకాశమే ఉంది. కానీ జోరు పెంచాల్సిన సమయంలో భారత్‌ తడబడింది. ఎంగిడి విజృంభించడంతో చివరి 15 ఓవర్లలో 78 పరుగులు మాత్రమే చేసి నాలుగు వికెట్లు చేజార్చుకుంది. రోహిత్‌ కూడా ఎప్పటిలా గేర్‌ మార్చలేకపోయాడు.

96 వద్ద శంసి క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన అతడు.. 36వ ఓవర్లో శతకం (107 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. మరోవైపు శ్రేయస్‌ అయ్యర్‌ (30) నిలవగా భారత్‌ స్కోరు 200 దాటింది. ఆ తర్వాత ఓ రనౌటయ్యే ప్రమాదాన్ని కూడా తప్పించుకున్న రోహిత్‌..

ఆఖరికి 43వ ఓవర్లో ఎంగిడి బౌలింగ్‌లో ఔటయ్యాడు. అప్పటికి స్కోరు 236. అయ్యర్‌తో నాలుగో వికెట్‌కు రోహిత్‌ 52 పరుగులు జోడించాడు. పాండ్య (0), ధోని (13; 17 బంతుల్లో 1×4) విఫలమవడంతో భారత్‌కు రావాల్సిన ముగింపు రాలేదు.

అయ్యర్‌ ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. భువనేశ్వర్‌ (19 నాటౌట్‌) కాస్త బ్యాటు ఝుళిపించాడు. 

భారత్‌ ఇన్నింగ్స్‌: ధావన్‌ (సి) ఫెలుక్వాయో (బి) రబాడ 34; రోహిత్‌ శర్మ (సి) క్లాసన్‌ (బి) ఎంగిడి 115; కోహ్లి రనౌట్‌ 36; రహానె రనౌట్‌ 8; శ్రేయస్‌ అయ్యర్‌ (సి) క్లాసన్‌ (బి) ఎంగిడి 30; పాండ్య (సి) క్లాసన్‌ (బి) ఎంగిడి 0; ధోని (సి) మార్‌క్రమ్‌ (బి) ఎంగిడి 13; భువనేశ్వర్‌ నాటౌట్‌ 19; కుల్‌దీప్‌ యాదవ్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 17 మొత్తం: (50 ఓవర్లలో 7 వికెట్లకు) 274; వికెట్ల పతనం: 1-48, 2-153, 3-176, 4-236, 5-236, 6-238, 7-265; బౌలింగ్‌: మోర్నీ మోర్కెల్‌ 10-2-44-0; రబాడ 9-0-58-1; ఎంగిడి 9-1-51-4; ఫెలుక్వాయో 8-0-34-0; డుమిని 4-0-29-0; శంసి 10-0-48-0 

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: ఆమ్లా రనౌట్‌ 71; మార్‌క్రమ్‌ (సి) కోహ్లి (బి) బుమ్రా 32; డుమిని (సి) రోహిత్‌ (బి) పాండ్య 1; డివిలియర్స్‌ (సి) ధోని (బి) పాండ్య 6; మిల్లర్‌ (బి) చాహల్‌ 36; క్లాసన్‌ (స్టంప్డ్‌) ధోని (బి) కుల్‌దీప్‌ 39; ఫెలుక్వాయో (బి) కుల్‌దీప్‌ 0; రబాడ (సి) చాహల్‌ (బి) కుల్‌దీప్‌ 3; మోర్కెల్‌ ఎల్బీ (బి) చాహల్‌ 1; శంసి (సి) పాండ్య (బి) కుల్‌దీప్‌ 0; ఎంగిడి నాటౌట్‌ 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం: (42.2 ఓవర్లలో ఆలౌట్‌) 201;వికెట్ల పతనం: 1-52, 2-55, 3-65, 4-127, 5-166, 6-168, 7-196, 8-197, 9-201; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 7-0-43-0; బుమ్రా 7-0-22-1; పాండ్య 9-0-30-2; కుల్‌దీప్‌ యాదవ్‌ 10-0-57-4; చాహల్‌ 9.2-0-43-2 రోహిత్‌ శర్మ స్కోరు. దక్షిణాఫ్రికా గడ్డపై ఏ ఫార్మాట్లో అయినా అతడికిదే అత్యధిక స్కోరు. అతనక్కడ సెంచరీ చేయడమిదే తొలిసారి.

గత అత్యధిక స్కోరు 53. అది కూడా టీ20ల్లో సాధించాడు. వన్డేల్లో అత్యధికంగా 23 పరుగులు, టెస్టుల్లో 47 పరుగులు చేశాడు. ప్రస్తుత సిరీస్‌ కంటే ముందు టెస్టుల్లో, వన్డేల్లో కలిపి భారత్‌ దక్షిణాఫ్రికాలో ఆడిన సిరీస్‌లు. అందులో టెస్టులవి 7, వన్డేలవి 7.

ఒక్కసారీ సిరీస్‌ గెలవలేదు. 1992 చివర్లో తొలి వన్డే, టెస్టు సిరీస్‌లు ఆడారు. ”చాలా చాలా సంతోషంగా ఉంది. గెలిస్తే చరిత్ర సృష్టిస్తామని జట్టులో అందరికి తెలుసు. విజయం కోసం చాలా కష్టపడ్డాం.

సాధించాం.. జొహానెస్‌బర్గ్‌లో మూడో టెస్టు నుంచి భారత్‌ జోరు కొనసాగుతోంది. సమష్టిగా ఆడి చరిత్ర సృష్టించాం. బ్యాటింగ్‌లో ముగ్గురు స్థిరంగా ఆడారు.

స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. 4-1తో వన్డే సిరీస్‌ గెలిచాం. ఇప్పుడు మా లక్ష్యం 5-1తో సిరీస్‌ ముగించడం” – కోహ్లి

Related Images: