ఆ హీరోయిన్‌ ‘నో’ అన్నందుకే  చుక్కలు చూపిస్తున్నారు

ఆ హీరోయిన్‌ ‘నో’ అన్నందుకే చుక్కలు చూపిస్తున్నారు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి కొత్తగా చెప్పేదేముంది. పేరుకే పేరున్న కుటుంబాలు… మీడియా ముందే నీతులు, నిజాయితీలు అంటూ మాటలు చెప్తూ ఉంటారు.తెరవెనుక మాత్రం హీరోయిన్స్‌ని ఫాం హౌస్‌లకు తీసుకెళ్ళడం, బ్లాక్ మెయిల్ చెయ్యడాలు వెరీ కామన్. 90లలో టాప్ రేంజ్‌లో ఉన్న ఒక హీరోయిన్‌ని ఇప్పటికీ కూడా ఒక వర్గం వారు గర్వంగా ఫీలయ్యే ఒక పొలిటీషియన్ కం ఫ్యాక్షన్ లీడర్ ఎత్తుకెళ్ళిపోయి రోజుల తరబడి తన గెస్ట్‌ హౌస్‌లోనే ఉంచుకున్నాడన్న వ్యవహారాలు ఇక్కడ ఎన్నో వినిపిస్తూ ఉంటాయి. వాళ్ళంతా ఆదర్శ పురుషులుగా కీర్తించబడుతూ ఉంటారు మన దగ్గర. ఇలాంటి వేషాలు వెయ్యబోతేనే ఆ మధ్య పాలిటిక్స్‌లో కూడా ఉన్న ఒక హీరోకి హీరోయిన్ రాధికా ఆప్టే సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. సూపర్ టాలెంటెడ్ యాక్ట్రెస్ అయిన రాధికా ఆప్టేను మరో రకంగా వాడుకోవాలనుకున్నారు సదరు పేరు గొప్ప హీరోగారు. రాధికా ఆప్టేకు చుక్కలు చూపించాడు. పేరు గొప్ప వంశం అని చెప్పుకునే హీరోల చీకటి వ్యవహారాలు జుగుప్స కలిగించేలా ఉంటాయి మరి.

ఇక ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో బ్రిలియంట్ యాక్ట్రెస్ సాఫ్ట్ టార్గెట్ అయిందని తెలుస్తోంది.

heroine affairs

హీరోలకంటే కూడా గొప్పగా డ్యాన్స్ చేయగల ఆ హీరోయిన్ ముందుగా మలయాళంలో సెన్సేషనల్ హిట్ కొట్టింది. ఆ తర్వాత ఒక గొప్ప వంశం నుంచే వచ్చిన హీరో పక్కన యాక్ట్ చేసిన తెలుగు సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రేక్షకులు ఆమె నటనకు ఫిదా అయిపోయారు. అయితే తెలుగు ఇండస్ట్రీలో కొంతమంది కుర్ర హీరోలు, బ్రోకర్స్‌లాంటి డైరెక్టర్స్ మాత్రం సదరు హీరోయిన్‌ని కమిట్మెంట్స్‌కి ఒప్పించాలన్నట్టు తమ మేనేజర్స్‌లాంటి బ్రోకర్స్‌తో రాయబారం పంపారట.

radhika-apte_

తిక్క రేగిన ఆ హీరోయిన్ ఏకంగా ఆయా సినిమాల నుంచే తప్పుకుందని తెలుస్తోంది. మలయాళం, తమిళ్ సినిమాలు చేసుకుంటూ బ్రతికెయ్యగలనని…యాక్టింగ్ టాలెంట్‌ని నమ్ముకుంటానని..ఇలాంటి పిచ్చి వేషాలు తన దగ్గర వెయ్యొద్దని రీసెంట్‌గా ఒక మోస్తర్ హిట్ కొట్టిన స్మాల్ రేంజ్ హీరోకి అయితే వార్నింగ్ ఇచ్చిందట. మొత్తంగా ఈ హీరోయిన్ ఎపిసోడ్‌ని మొత్తం పరిశీలిస్తున్న సినిమా క్రిటిక్స్ మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది బలుపు హీరోలకు శరీరం చూపించి బ్రతికే హీరోయిన్స్, శరీరంతో బ్రతికే హీరోయిన్స్ తప్ప టాలెంటెడ్ యాక్ట్రెస్‌లు అవసరం లేదని అంతర్గత చర్చల్లో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.

Related Images: