మరోసారి పిచ్చెక్కించిన-ప్రియా వారియర్..!

మరోసారి పిచ్చెక్కించిన-ప్రియా వారియర్..!

మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన ‘ఓరు అడార్ లవ్’ సినిమాలోని కన్నుకొడుతున్న వీడియో రెండు మూడు రోజులుగా ఇంటర్నెట్, సోషల్ మీడియాలో సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియో చూసి యువత పిచ్చెక్కిపోయారు. ఆ వీడియో మత్తు ఇంకా దిగక ముందే….. ప్రేమికుల రోజు సందర్భంగా టీజర్ విడుదల చేశారు.

ప్రియా వారియర్ తుపాకి వీడియో వైరల్!

ఈసారి విడుదలైన వీడియో(టీజర్)లో తన ప్రియుడిపైకి ప్రేమ తుపాకి ఎక్కుపెట్టింది ప్రియా వారియర్. ముద్దులనే బుల్లెట్లుగా మార్చి అతడి గుండెల్లో కసిగా దించేసింది. ఈ టీజర్ కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో వైరల్ అవ్వడంతో పాటు ట్రెండింగ్ లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది.

priya akashaa

కొన్ని గంటల్లోనే…

తాజాతా విడుదలైన టీజర్ కొన్ని గంటల్లోనే సెన్సేషన్ అయింది. ఇప్పటికే వీడియో హిట్స్ సంఖ్య యూట్యూబ్‌లో 50 లక్షలకు చేరువైంది. ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఫాలోయింగ్…

మొదట విడుదలైన కన్ను గీటే వీడియోతో…. ప్రియా వారియర్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. మొన్నటి వరకు వేలల్లో ఉన్న ఆమె సోషల్ మీడియా ఫాలోవర్స్ సంఖ్య ఈ వీడియో తర్వాత మిలియన్ మార్క్ చేరుకుంది.

‘ఓరు అడార్ లవ్’ టీజర్ ఇదే…

‘ఓరు అడార్ లవ్’ టీజర్ ఇదే. వాలంటైన్స్ డే సందర్భంగా దీన్ని విడుదల చేశారు. ఈ చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్, రోషన్ అబ్దుల్ రవూఫ్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఓమర్ లులు దర్శకత్వం వహిస్తున్నారు.

మార్చి 1న సినిమా రిలీజ్…

‘ఓరు అడార్ లవ్’ లవ్ చిత్రం మార్చి 1న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రియా వారియర్ అందానికి దేశం మొత్తం ఫిదా అవ్వడంతో ఈ మలయాళ చిత్రం కేరళలో హిట్టయితే….. ఇతర భాషల్లో కూడా విడుదల చేసే అవకాశం ఉంది.

Related Images: