డైరెక్టర్‌తో ఎఫైర్‌పై క్లారిటీ ఇచ్చిన రాశీఖన్నా

డైరెక్టర్‌తో ఎఫైర్‌పై క్లారిటీ ఇచ్చిన రాశీఖన్నా

ఫిబ్రవరి 18న పుట్టినరోజు జరుపుకున్న రాశీ ఖన్నా.. తనపై వస్తున్న ఓ గాసిప్‌పై కూడా క్లారిటీ ఇచ్చేసింది. తనకి హిట్ సినిమా ఇచ్చిన టాలీవుడ్‌లోని ఓ దర్శకుడితో ఏవేవో సంబంధాలు ఉన్నట్లుగా వస్తున్న వార్తలను ఆమె ఖండిస్తూ.. ఆ దర్శకుడు కేవలం ఫ్రెండ్ మాత్రమే అని ఆ గాసిప్‌కి ఫుల్‌స్టాప్ పెట్టేసింది.

విషయంలోకి వస్తే రాశీ ఖన్నా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సుప్రీమ్ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం తర్వాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన రాజా ది గ్రేట్ చిత్రంలో ఓ సాంగ్‌లో నటించింది. అయితే సుప్రీమ్ తర్వాత అనిల్ రావిపూడి, రాశీ ఖన్నాల మధ్య ఎఫైర్ నడుస్తుందనే గాసిప్స్ హల్‌చల్ చేశాయి. అయితే ఈ వార్తలను తాజాగా రాశీఖన్నా కొట్టిపారేసింది.

”సుప్రీమ్ చిత్రంతో మంచి హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి నాకు మంచి స్నేహితుడు. బెంగాల్ టైగర్ చిత్రంలో రవితేజగారితో నటించాను. అప్పటి నుంచి రవితేజగారితో స్నేహంగా ఉంటాను. వారిద్దరి కోసమే రాజా ది గ్రేట్ చిత్రం సాంగ్‌లో కనిపించాను. అంతే తప్ప మా మధ్య ఎటువంటి ఎఫైర్స్ లేవు. ఇలాంటివి పుట్టించే ముందు ఒక్కసారి తెలుసుకోండి. ఎలాపడితే అలా రాయవద్దు. ఇది తప్పు, ఇది ఒప్పు అని తెలుసుకునే జ్ఞానం ఉన్నప్పుడు తెలిసి కూడా ఎలా తప్పు చేస్తాను..” అంటూ రాశీఖన్నా ఈ గాసిప్స్‌పై క్లారిటీ ఇచ్చింది.

Related Images: