రిచర్డ్స్ రికార్డుకు చేరువలో కొహ్లీ..!

రిచర్డ్స్ రికార్డుకు చేరువలో కొహ్లీ..!

ప్రపంచ ప్రస్తుత క్రికెట్లో రికార్డుల మొనగాడు విరాట్ కొహ్లీని…మరో అరుదైన రికార్డు ఊరిస్తోంది. విదేశీ సిరీస్ లో వెయ్యి పరుగులు సాధించినకరీబియన్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ రికార్డును సమం చేసే అవకాశం టీమిండియా కెప్టెన్ కోసం..ఆఖరి రెండు టీ-20 మ్యాచ్ ల ద్వారా ఎదురుచూస్తోంది. అయితే.ఆఖరి రెండుమ్యాచ్ ల్లో 130 పరుగుల స్కోరు చేసే అవకాశం రన్ మెషీన్ విరాట్ కొహ్లీకి చిక్కుతుందా?

virat kohli

అంతర్జాతీయ క్రికెట్లో ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ హవా కొనసాగుతోంది. సాంప్రదాయ టెస్ట్ క్రికెట్..ఇన్ స్టంట్ వన్డే క్రికెట్..ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్.ఫార్మాట్ ఏదైనా.

vkohli

కొహ్లీ బ్యాట్ నుంచి పరుగులు వెల్లువెత్తుతున్నాయి. సెంచరీల మీటర్ రీడింగ్ శరవేగంతో తిరిగిపోతోంది. 2017 సీజన్లో మాత్రమే కాదు.ప్రస్తుత సీజన్లో సైతం కొహ్లీ దూకుడే కొనసాగుతోంది.

xVivians-Richard

సఫారీ వేట..పరుగుల మోత.

విరాట్ కొహ్లీ నాయకత్వంలో .రెండుమాసాల పర్యటన కోసం సౌతాఫ్రిగా గడ్డపైన అడుగుపెట్టిన టీమిండియాకు..ఇప్పటి వరకూ మిశ్రమఫలితాలే ఎదురయ్యాయి. తొలిదశ తీన్మార్ టెస్ట్ సిరీస్ లో 1-2తో టీమిండియా ఓడినా..కెప్టెన్ విరాట్ కొహ్లీ ఓ ఫైటింగ్ సెంచరీతో పాటు.286 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. సఫారీ ఫాస్ట్ బౌలింగ్ ఎటాక్ ను సమర్థవంతంగా ఎదుర్కొని. విజయం సాధించే దమ్ము టీమిండియాకు ఉందని చాటి చెప్పాడు.

viv-richards-virat-kohli-

వన్డే సిరీస్ లో పరుగుల వరద..

ఇక.ఆరుమ్యాచ్ ల వన్డే సిరీస్ లో కొహ్లీ దూకుడుకు అడ్డేలేకుండా పోయింది. ఒకటి కాదు.రెండు కాదు.ఏకంగా మూడు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీతో సహా రికార్డుస్థాయిలో 558 పరుగులు నమోదు చేశాడు.

Viv-Richards

తనజట్టుకు 5-1 విజయంతో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు సైతం అందుకొన్నాడు. సఫారీగడ్డపై ఒకే సిరీస్ లో మూడు శతకాలు బాదిన తొలి భారత, విదేశీ క్రికెటర్ గా కొహ్లీ రికార్డుల్లో చేరాడు.

టీ-20 సిరీస్ లో..

మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో భాగంగా..జోహెన్స్ బర్గ్ న్యూవాండరర్స్ స్టేడియం వేదికగా ముగిసిన తొలివన్డేలో టీమిండియా విజయంలో ఓపెనర్ శిఖర్ ధావన్, ఓపెనింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ప్రధానపాత్ర వహించారు. కొహ్లీ మాత్రం 26 పరుగుల వ్యక్తిగత స్కోరుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

తీన్మార్ టెస్ట్ సిరీస్ లోని తొలి మ్యాచ్ నుంచి మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లోని మొదటి మ్యాచ్ వరకూ.కొహ్లీ మొత్తం నాలుగు శతకాలు, రెండు హాఫ్ సెంచరీలతో సహా మొత్తం 870 పరుగులు సాధించాడు. విదేశీ గడ్డపై మూడుఫార్మాట్ల సిరీస్ లో అత్యధిక పరుగులు సాధించిన భారత క్రికెటర్ గా నిలిచాడు.

virat-kohli

అయితే.కరీబియన్ క్రికెట్ దిగ్గజం, వెస్టిండీస్ ఆల్ టైమ్ గ్రేట్ సర్ వివియన్ రిచర్డ్స్ పేరుతో ఉన్న సింగిల్ సిరీస్ లో వెయ్యి పరుగుల రికార్డుకు కొహ్లీ 130 పరుగుల దూరంలో నిలిచాడు.

రిచర్డ్స్ రికార్డును సమం చేయాలన్నా.సరసన నిలవాలన్నా మిగిలిన రెండు టీ-20 మ్యాచ్ ల్లో కొహ్లీ మరో 130 పరుగులు చేస్తే చాలు.

viv-richards-virat-kohli-

దటీజ్ వీవ్ రిచర్డ్స్…

1980 దశకంలో ప్రపంచ క్రికెట్ ను ఓ కుదుపుకుదిపేసిన కరీబియన్ సూపర్ హిట్టర్ వివియన్ రిచర్డ్స్.1976 ఇంగ్లండ్ సిరీస్ లో ఏకంగా 1045 పరుగులు సాధించి.ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో 829 పరుగులు, వన్డే సిరీస్ లో 216 పరుగులు సాధించడం ద్వారా రిచర్డ్స్ తనకు తానే సాటిగా నిలిచాడు. విదేశీగడ్డపై ముగిసిన ఓ సింగిల్ టూర్ లో.వెయ్యి పరుగులు సాధించిన ఒకేఒక్క. ఏకైక క్రికెటర్ నాటినుంచి నేటి వరకూ వివియన్ రిచర్డ్స్ మాత్రమే.

viv richardson

ఆ తర్వాత.మాస్టర్ సచిన్ టెండుల్కర్ తో సహా ఎందరెందరో గొప్పగొప్ప క్రికెటర్లు వచ్చినా.మెరుపులు మెరిపించినా .వీవ్ రిచర్డ్స్ రికార్డును అందుకోలేకపోయారు. అయితే..అరుదైన ఆ రికార్డును సమం చేయటం లేదా.అధిగమించే అవకాశం ఇప్పుడు విరాట్ కొహ్లీకి దక్కింది.

తనదైన రోజున అలవోకగా పరుగులు సాధించే సత్తా ఉన్న విరాట్ .చివరి రెండు ఇన్నింగ్స్ లో స్థాయికి తగ్గట్టుగా రాణించగలిగితే.ద గ్రేట్.సర్ వివియన్ రిచర్డ్స్ సరసన నిలువగలుగుతాడు.

Related Images: