కమల్ హాసన్ పార్టీ గుర్తులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!

కమల్ హాసన్ పార్టీ గుర్తులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!

నటుడు కమల్ హాసన్ బుధవారం సాయంత్రం పార్టీని, పార్టీ గుర్తును ప్రకటించారు. మక్కల్ నీది మయ్యమ్ పార్టీ పేరుగా ప్రకటించిన కమల్ తెలుపు రంగు జెండాలో ఎరుపు, నలుపు రంగు మిళితమైన ఆరు చేతులు కలిసి ఉన్నట్లుగా పార్టీ గుర్తు ఉంది. మధ్యలో నక్షత్రం ఉంది.

పార్టీ గుర్తులే చేయి చేయి కలిపి ఉన్న దానికి, మధ్యలోని నక్షత్రానికి అర్ధాన్ని కమల్ హాసన్ మీడియాకు వెల్లడించారు. గుర్తులో ఉన్న ఆరు చేతులు ఆరు రాష్ట్రాలు అని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబర్ దీవులని చెప్పారు.

actor-kamal-haasan-

రాష్ట్రం అవినీతితో రగిలిపోతోంది

పార్టీ ఏర్పాటు తన ఎన్నో ఏళ్ల లక్ష్యమని కమల్ హాసన్ చెప్పారు. ఇది ప్రజల పార్టీ అని, ఇందులో తాను ఓ భాగం మాత్రమేనని చెప్పారు. నేడు రాష్ట్రం అవినీతితో రగిలిపోతోందని, తాను ఉపన్యాసాలు ఇవ్వడానికి రాలేదని, మీ సలహాలు తీసుకునేందుకు వచ్చానని ప్రజలను ఉద్దేశించి అన్నారు. అవినీతిరహిత రాష్ట్రం తన లక్ష్యమని చెప్పారు.

actor-kamal-haasan-

మయ్యమ్ అంటే సెంటర్ అని అర్థం

తన పార్టీ పేరులో ఉన్న మయ్యమ్ అంటే చాలామంది తాను లెఫ్ట్ పార్టీకి మద్దతిస్తున్నానా, లేక రైట్ పార్టీకి మద్దతిస్తానా అని అడుగుతున్నారని కమల్ హాసన్ చెప్పారు. ఆ రెండింట్లో ఏదీ కాదని చెప్పారు. అందుకే మయ్యమ్ అని పేరు పెట్టానని, మయ్యమ్ అంటే సెంటర్ అని అర్థమని తెలిపారు.

actor-kamal-haasan-

దక్షిణాదిపై కమల్ హాసన్ దృష్టి

కమల్ హాసన్ దక్షిణాది పైన ప్రధానంగా దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. ఇక్కడ ఆయనకు చాలామంది అభిమానులు ఉన్నారు. పార్టీ గుర్తులోను ఆరు దక్షిణాది రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాన్ని పెట్టుకోవడం గమనార్హం. దీంతో ఆయన తమిళనాడుపై ప్రధానంగా దృష్టి సారించడంతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో ఇతరులతో కలిసే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు.

actor-kamal-haasan-

డబ్బు కోసం ఓట్లు అమ్ముకోవద్దు

పార్టీ ప్రకటన సమయంలో కమల్ హాసన్ మాట్లాడుతూ.. 
డబ్బుకు ఓట్లను అమ్ముకోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. అన్ని వర్గాల సంక్షేమం కోసమే తమ పార్టీ పని చేస్తుందని తెలిపారు. రాష్ట్రం నుంచి అవినీతిని తరిమేస్తామన్నారు. కావేరీ తీర్పును అందరూ గౌరవించాలన్నారు. కుల రాజకీయాలను అంతమొందిస్తామన్నారు. చంద్రబాబు, ఒబామా, పినరాయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్ అందరూ తనకు ఇష్టమే అన్నారు.

kamal_haasan_polparty_eps

Related Images: