నా విషయంలో నోరు పడిపోయిందా…పవన్ ఫై : మహేష్ కత్తి

నా విషయంలో నోరు పడిపోయిందా…పవన్ ఫై : మహేష్ కత్తి

మహేష్ కత్తి మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేశారు. తన పైన అభిమానులు చేసిన మాటల దాడిపై ఎందుకు స్పందించలేదని ఆయన నిలదీశారు. ఈ సందర్భంగా ఇతరులపై జరిగిన దాడిని ప్రస్తావించారు.

ఇటీవలి వరకు మూడు నాలుగు నెలల పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు, మహేష్ కత్తి మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ వివాదానికి తెరపడింది. ఆ తర్వాత అప్పుడప్పుడు ప్రశ్నిస్తున్నారు.

pawan-and-kathimahesh

అప్పుడప్పుడు పంచ్‌లు…

వివాదానికి తెరపడక ముందు ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ స్పందిస్తేనే తప్ప వెనక్కి తగ్గనని చెప్పిన మహేష్ కత్తి ఎట్టకేలకు జనసేన పార్టీ విడుదల చేసిన ఓ ప్రకటనతో వివాదానికి ఫుల్‌స్టాప్ పెడుతున్నట్లు ప్రకటించారు. అయినప్పటికీ పవన్ రాజకీయాలపై అప్పుడప్పుడు పంచ్‌లు వేస్తున్నారు.

Pawan-Kalyan

ఖండించిన పవన్ కళ్యాణ్…

అయితే అప్పుడు జరిగిన వివాదంపై పవన్ కళ్యాణ్ స్వయంగా ఎందుకు స్పందించలేదని మహేష్ కత్తి తాజాగా ప్రశ్నించాడు. ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న డిబేట్‌లో నటుడు శివాజీపై బిజెపి కార్యకర్తలు దాడి ప్రయత్నం చేశారు. మహా న్యూస్ సిబ్బందిపై దాడి జరిగింది. వీటిని పవన్ ఖండించారు.

pawan kalyan janasena

 
మహేష్ కత్తి ట్వీట్…

అదే విషయం చెబుతూ మహేష్ కత్తి ప్రశ్నించారు. ‘నటుడు శివాజీ మీద దాడిని ఖండించావు. మహా న్యూస్ మీద జరిగిన దాడిని ఖండించావు. అప్రజాస్వామికం అన్నావు. బాగుంది. పవన్ కళ్యాణ్ కి నా అభినందనలు. మరి నా మీద నీ అభిమానులు దాడిచేస్తే మాత్రం నీలో స్పందన ఉండదా! నోరు పడిపోతుందా! మనసు రాదా!’ అని ప్రశ్నించారు.

kathi-mahesh
చంద్రబాబుపై ట్వీట్

అంతకుముందు ఓ పత్రికలో వచ్చిన ప్రత్యేక హోదా అంశాన్ని ట్వీట్ చేశారు. దర్జాగా మోసం! అంటూ ఈ ట్వీట్ చేశారు. హోదా అంటే జైలుకే అని గతంలో చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినట్లుగా, హోదా ఇవ్వాల్సిందేనని ఇప్పుడు చెప్పినట్లుగా ఉంది.

Related Images: