విక్రమ్ స్కెచ్ సినిమా రివ్యూ

విక్రమ్ స్కెచ్ సినిమా రివ్యూ

సేతు, అపరిచితుడు, శివపుత్రుడు లాంటి వైవిధ్యమైన చిత్రాలతో చియాన్ విక్రమ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. విలక్షణమైన నటుడిగా విక్రమ్ ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ ఉంది. ఓ వైవిధ్యమైన పాయింట్‌తోపాటు, అందాలతార తమన్నా భాటియాతో జతకట్టి విక్రమ్ తాజాగా స్కెచ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫిబ్రవరి 23న రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరక ఆకట్టుకొన్నదనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

vikram sktech movie review

స్కెచ్ కథ

స్కెచ్ (విక్రమ్) లోన్ వాయిదాలు కట్టకపోతే వాహనాలను ఎత్తుకొచ్చే రికవరీ ఏజెంట్. సేట్ అనే వ్యాపారి (హరీష్ పెరాడీ) వద్ద పనిచేస్తుంటాడు. ముగ్గురు మిత్రులతో కలిసి వ్యవహారాలు నిర్వహిస్తుంటాడు వాహనాలు ఎత్తుకొచ్చే క్రమంలో అమ్ము (తమన్నా)తో ప్రేమలో పడుతాడు. కథ ఇలా సాగుతుండగా, కుమార్ అనే మాఫియా గ్యాంగ్ లీడర్‌ కారు ఎత్తుకు రావడం వల్ల స్కెచ్‌కు సమస్యలు ప్రారంభమవుతాయి.

vikram sktech movie review

స్కెచ్ వేసిన తీరు..

ప్రత్యర్థి వర్గం నుంచి తనకు ఎదురైన సమస్యలను ఎలా ఎదురించాడు? ప్రేమించిన తమన్నాను పెళ్లి చేసుకొన్నాడా? తనతో కలిసి పనిచేసే మరో ముగ్గురు స్నేహితులను ఏ పరిస్థితుల్లో కోల్పోయాడు? తన స్నేహితులను ఎవరు మట్టుపెట్టారు? అనే ప్రశ్నలకు తెర మీద సమాధానమే స్కెచ్ సినిమా కథ.

vikram sktech movie review

కథా విశ్లేషణ 

ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని ఓ పాయింటే స్కెచ్ చిత్ర కథ. హృదయానికి హత్తుకొకనే ఓ మంచి సందేశం కథలో ఉంది. వెహికిల్స్ సీజ్ చేసే వ్యక్తుల జీవితంలో ఎలాంటి సమస్యలు ఉంటాయి. వారి మధ్య గ్రూపు తగదాలు, వివాదాలు ఎలా ఉంటాయనే అంశాలతో తొలి భాగం సాగుతుంది. తొలిభాగంలో పెద్ద కథ లేకపోవడం, కథనం నెమ్మదించడం, రొటీన్‌గా కథ సాగడం ప్రేక్షకుడిని కొంత ఇబ్బందికి గురిచేస్తుంది. కానీ ఓ మంచి ఛేజింగ్ సీన్‌తో ఆసక్తి రేకెత్తించడంతో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది.

vikram sktech movie review

కథా విశ్లేషణ-2 

ఇక రెండో భాగంలో అసలు కథ మొదలవుతుంది. కుటుంబం, ప్రేమ, స్నేహితుల మధ్య నడిచే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకుడిని కథలో లీనమయ్యేలా చేస్తాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ సన్నివేశాలు వరకు థ్రిల్లింగ్ ఉంటాయి. విక్రమ్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకోకుండా రొటీన్‌కు భిన్నంగా సినిమాను ముగించడం స్కెచ్‌కు ప్రధాన ఆకర్షణ. సినిమా ముగింపే ప్రేక్షకుడికి ఆకట్టుకునే అంశంగా మారడం స్కెచ్‌కు బలం అని చెప్పవచ్చు. అయితే తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని నటుల ఎక్కువ మంది ఉండటం ఈ సినిమాకు మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు.

vikram sktech movie review

దర్శకుడి ప్రతిభ

స్కెచ్‌ చిత్రానికి దర్శకుడు విజయ్ చందర్. సమాజానికి చక్కటి సందేశం అందించే క్రమంలో పక్కా మాస్ కమర్షియల్ అంశాలను మేలవించి స్కెచ్‌ను రూపొందించడం అభినందనీయం. తొలిభాగంలో కథపై ఇంకా కసరత్తు చేసి ఉంటే సినిమా మరోస్థాయి విజయాన్ని అందుకునే అవకాశం ఉండేది. ఏది ఏమైనా సమాజంపై దర్శకుడి ఆలోచన తీరు ప్రశంసనీయం.

vikram sktech movie review

మరోసారి విక్రమ్ మ్యాజిక్

విలక్షణమైన పాత్రలతో ఇప్పటి వరకు తెర మీద మ్యాజిక్ చేసిన విక్రమ్.. స్కెచ్ సినిమాలో తనకు నటనకు సంబంధించి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించుకొన్నాడు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం ఆయనకు కొత్తేమీ కాదు. స్కెచ్ పాత్రలో మళ్లీ అదే మ్యాజిక్ చేశాడు. పక్కా మాస్ పాత్రలో లీనమైపోయాడు. రొమాంటిక్ సన్నివేశాల్లో ఆకట్టుకొన్నాడు. క్లైమాక్స్‌లో విక్రమ్ మరోసారి అద్భుతమైన నటనను ప్రదర్శించాడు.

vikram sktech movie review

తమన్నా గ్లామర్

అమ్ములు పాత్రలో తమన్నా చక్కటి సంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయిగా కనిపించింది. కట్టు, బొట్టుతో ఆకట్టుకొన్నది. పాటల్లో గ్లామర్‌తో అలరించింది. కీలక సన్నివేశాల్లో తమన్నా నటన ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది.

vikram sktech movie review

ఆకట్టుకొనే సినిమాటోగ్రఫీ

స్కెచ్ సినిమాకు డీసెంట్‌గా ఎం సుకుమార్ అందించిన సినిమాటోగ్రఫీని అందించారు. ఛేజింగ్ సీన్లు, పాటల చిత్రీకరణ ఆకట్టుకునేలా ఉంటాయి. విలన్‌ను చంపే పోల్ సీన్ సినిమాకు హైలెట్ మాత్రమే కాకుండా, ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తుంది.

vikram sktech movie review

రొటీన్‌గా థమన్

స్కెచ్ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు. ఈ సినిమాకు థమన్ అందించిన మ్యూజిక్ అంతంత మాత్రంగానే ఉంది. కొన్ని సన్నివేశాల్లో రీరికార్డింగ్ మినహా, పాటలు ఆకట్టుకొనేలా లేవు. మ్యూజిక్ రొటీన్‌గా అనిపిస్తుంది. ఎడిటర్ రూబెన్‌ ఇంకా కొంత దృష్టిపెడితే సినిమా క్రిస్ప్ అనిపించేది.

vikram sktech movie review

ఎస్ థాను నిర్మాణ విలువలు

స్కెచ్‌ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఎస్ థాను రూపొందించాడు. నిర్మాణ విలువలు ఆకట్టుకొనేలా ఉన్నాయి. కథ, సాంకేతిక నిపుణల ఎంపిక బాగుంది. కథకు అవసరమైన మూడ్ క్రియేట్ చేయడానికి వేసిన సెట్టింగులు బాగున్నాయి.

vikram sktech movie review

ఫైనల్ జడ్జిమెంట్

కమర్షియల్ అంశాలతో సమాజానికి ఓ చక్కటి సందేశం ఇచ్చిన చిత్రం స్కెచ్. చదువు అనేది ఓ వ్యక్తికి, సమాజానికి ఎంత ముఖ్యమో అనే సింగిల్ పాయింట్‌ కథకు రికవరీ ఏజెంట్ల జీవితాన్ని జోడించాడు. క్లైమాక్స్‌లో విక్రమ్ ప్రదర్శించిన నటను సినిమాకు హైలెట్. విక్రమ్ సినిమాలను, సామాజిక సందేశ చిత్రాలను ఆశించే ప్రేక్షకులకు స్కెచ్ పైసా వసూల్ చిత్రమని చెప్పవచ్చు.

vikram sktech movie review

బలం, బలహీనతలు 
ప్లస్ పాయింట్స్

  • విక్రమ్ నటన
  • తమన్నా గ్లామర్
  • సినిమాటోగ్రఫీ
  • క్లైమాక్స్
  • దర్శకుడి టేకింగ్

మైనస్ పాయింట్స్ 

  • ఫస్టాఫ్
  • మ్యూజిక్
  • ఎడిటింగ్

నటీనటులు, సాంకేతివర్గం 
తెర వెనుక, తెర ముందు

నటీనటులు: విక్రమ్, తమన్నా, హరీష్ పెరాడీ, సూరీ, శ్రీమాన్ తదితరులు
దర్శకుడు: విజయ్
నిర్మాత: ఎస్ థాను
మ్యూజిక్ డైరెక్టర్: ఎస్ థాను
సినిమాటోగ్రాఫర్: ఎం సుకుమార్
ఎడిటర్: రుబెన్
రిలీజ్ డేట్: ఫిబ్రవరి 13, 2018

Related Images: