ఓటుకు నోటు కేసు వ్యవహారం కీలక మలుపు

ఓటుకు నోటు కేసు వ్యవహారం కీలక మలుపు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఎ4 నిందితుడుగా వున్న జెరుసలెం మత్తయ తాను అఫ్రూవర్‌గా మారతానని సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌కు శుక్రవారం లేఖ రాశారు. వాస్తవా నికి ఈ కేసులో తనకు ఎటువంటి సంబంధం లేదని, ఆరోజున నామినెటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌ సన్‌ను క్రిస్టియన్‌ సమస్యలపై మాట్లాడేందుకు వెళ్లానని, అనుకోకుండా రేవంత్‌రెడ్డి డబ్బులతో దొరికిపోగా ఈకేసులో నన్ను ఇరికించారని మత్తయ్య తన లేఖలో వివరించారు.

ఈ కేసులో ఎపి, తెలంగాణ ప్రభుత్వాలు సరిగ్గా వ్యవహ రించడంలేదని, తనను అకారణంగా ఇబ్బందు లకు గురిచేస్తున్నారని తెలిపారు. మత్తయ్య హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో తాను నూటికి నూరుపాళ్లు అమాయకుడి నని, అన్యాయంగా ఈకేసులో తనను ఇరికించా రని, అందుకే తాను పార్టీ ఇన్‌ పర్సన్‌గా అప్సియర్‌ అవుతానని పిటిషన్‌ దాఖలు చేశానని ఆయన తెలిపారు. ఈ కేసును విచారణ సుప్రీం కోర్టు పూర్తిస్థాయిలో విచారణ చేబట్టాలని, ఇందులోని అన్ని విషయాలను వెలికి తీయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కేసులో తాను అప్రూ వర్‌గా మారి అన్ని విషయాలను సుప్రీం కోర్టుకు వెల్లడిస్తానని మత్తయ్య తెలిపారు.

Related Images: