వేసవిలో సందడి చేయునున్న అగ్రహీరోలు

వేసవిలో సందడి చేయునున్న అగ్రహీరోలు

ప్రతి ఏడాది వేసవిలో అగ్రహీరోల చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేయనున్నాయి. అయితే ఈసారి కాస్త భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. మార్చి 2వ తేదీనుంచి థియేటర్లు బంద్‌ కచ్చితమంటూ ఛాంబర్‌ ప్రకటించడంతో ఎన్నిరోజులు అలా జరుగుతుందో తెలీదు. కానీ అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం కొత్త సినిమాలు వేసవిలో విడుదలకు రంగం మాత్రం సిద్ధం చేస్తున్నాయి.

summer telugu movies

మార్చి 30 నుంచి మే రెండో వారం వరకు ఏ వీకెండ్‌ ఖాళీ లేదు. అన్నీ దాదాపు రిలీజ్‌ డేట్స్‌ ఫిక్స్‌ చేసుకున్నాయి. థియేటర్లతో అగ్రిమెంట్లు కుదుర్చుకునే పనిలో ఉన్నాయి. ఈ వేసవికి టాలీవుడ్‌లో రసవత్తరమైన పోరు సాగనుంది. వారానికో సినిమా వస్తోంది.

మార్చి 30 రంగస్థలం 
రామ్‌ చరణ్‌, సుకుమార్‌ కాంబినేషన్‌ లో రాబోతున్న రంగస్థలం సినిమా నుంచి సమ్మర్‌ ఫీవర్‌ షురూ అవుతుంది. ఈ మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. సమంత హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా 1980ల నాటి కథతో తెరకెక్కింది. దేవిశ్రీప్రసాద్‌ ఈ సినిమాకు సంగీతం అందించాడు. 1980నాటి కాల పరిస్థితులు, అప్పటి వాతావరణానికి తగినట్లు సెట్లు, సంభాషణలు, వస్త్రధారణ వంటి అనేక అంశాలను గుదిగుచ్చి ఈ చిత్రం రాబోతుంది. ఇందులో హీరో హీరోయిన్లు భిన్నమైన పాత్రల్ని పోషిస్తున్నారు. సుకుమార్‌ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

rangasthalam- movie

‘భరత్‌ అనే నేను’ ఏప్రిల్‌ 20 
మహేష్‌ నటిస్తున్న తాజా చిత్రం భరత్‌ అనే నేను. ‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ మూవీ తర్వాత మహేష్‌, కొరటాల కాంబోలో వస్తున్న సినిమా కావడంతో భరత్‌ అనే నేనుపై అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాతో కైరా అద్వానీ హీరోయిన్‌ గా పరిచయం అవుతోంది. మూవీకి సంబంధించి త్వరలోనే ఫారిన్‌ షెడ్యూల్‌ ప్రారంభమౌతుంది. రాజకీయ నేపథ్యంలో కూడిన చిత్రంగా చిత్ర యూనిట్‌ ప్రచారం చేస్తోంది. మహేష్‌ను అభిమానులు ఏవిధంగా చూడాలని కోరుకుంటారో ఆ విధంగా ఈ చిత్రముంటుందని దర్శకుడు తెలియజేస్తున్నారు. తన చిత్రాల్లో ఏదో ఒక సామాజిక అంశాన్ని టచ్‌ చేస్తున్నట్లు ఇందులోనూ చక్కటి అంశం వుంటుందని అది అందరినీ ఆలోజింపజేస్తుందని నమ్మకంగా చెబుతున్నారు.

bharat ane nenu movie

‘కృష్ణార్జున యుద్ధం’ ఏప్రిల్‌ 12 
వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని, ఈ సమ్మర్‌లో కూడా మరో సినిమా రిలీజ్‌ చేయబోతున్నాడు. సహజ నటుడిగా పేరుపొందిన ఆయన ఇందులో ద్విపాత్రిభనయం చేస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం చేసిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌, రుక్సార్‌ మిర్‌ హీరోయిన్లుగా నటించారు. హిపాప్‌ తమీజా ఈ సినిమాకు సంగీతం అందించాడు. కృష్ణుడు అర్జునుడు రెండు పాత్రలు ఎలా వుంటాయనేవి చిత్రంలోని ఆసక్తికర అంశమనీ, భారతంలో వున్న వారి పేర్లకు అనుగుణంగా ఇప్పటి ట్రెండ్‌కు తగినట్లు చిత్ర వుంటుందని తెలుస్తోంది.

Nani-Krishnarjuna-Yudham-Movie-

‘సాక్ష్యం’ మే 11 
బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, బ్యూటిఫుల్‌ పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సాక్ష్యం సినిమా కూడా సమ్మర్‌ కానుకగా ముస్తాబవుతోంది. శ్రీవాస్‌ డైరక్ట్‌ చేస్తున్న ఈ సినిమా కంప్లీట్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కుతోంది. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై నిర్మాత అభిషేక్‌ నామా ఈ సినిమాను ప్రొడ్యూస్‌ చేస్తున్నారు. ప్రకృతి, మానవుడుకి గల సంబంధాన్ని కంపేర్‌ చేస్తూ ఈచిత్ర కథ వుంటుందని దర్శకుడు తెలియజేస్తున్నాడు.

Sakshyam-movie-telugu

‘ఛల్‌ మోహన్‌ రంగ’ ఏప్రిల్‌ 5 
నితిన్‌, మేఘా ఆకాష్‌ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ఇది. కష్ణచైతన్య డైరక్ట్‌ చేసిన ఈ సినిమాకు త్రివిక్రమ్‌ కథ అందించాడు. పవన్‌, త్రివిక్రమ్‌, నితిన్‌ తండ్రి సుధాకర్‌ రెడ్డి కలిసి ఈ సినిమా నిర్మించారు. తమన్‌ సంగీతం అందించిన ఈ సినిమా పాటల్ని దశలవారీగా విడుదల చేస్తున్నారు. ఈ వేసవికి పెర్‌ ఫెక్ట్‌ రొమాంటిక్‌ మూవీగా ఇది పేరు తెచ్చుకుంది. నితిన్‌ ఇంతకుముందు చేసిన గుండెజారి గల్లంతయిందే తరహాలోనే చక్కటి ఎంటర్‌ టైన్‌మెంట్‌తో కూడిన ప్రేమకథగా వుంటుందని చిత్ర యూనిట్‌ చెబుతోంది. ప్రేమకథతో పాటు ఫ్యామిలీ సెంటి మెంట్‌తో మిళితమైన కథగా చెబుతున్నారు.

chal-mohan-ranga movie

‘నా పేరు సూర్య’ మే 4 
ఇటీవలే అగ్ర నిర్మాతలు తమ చిత్రాన్ని అగ్రహీరోల కోసం మార్చుకున్న చిత్రం ఇది. అల్లు అర్జున్‌ నటిస్తున్న సినిమా ఇది. వక్కంతం వంశీ డైరక్టర్‌గా పరిచయమౌతున్న ఈ సినిమాలో అను ఎమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. కంప్లీట్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌గా ఈ సినిమా రాబోతోంది. ఈ సమ్మర్‌ బరిలో పూర్తిస్థాయి యాక్షన్‌ చిత్రం ఇదే. విశాల్‌, శేఖర్‌ అందించిన సంగీతం ఈ సినిమాకు స్పెషల్‌ ఎట్రాక్షన్‌ కానుంది. దేశభక్తిని కల్గించే ఈ చిత్రంలో సోల్జర్‌ పాత్రలో అర్జున్‌ కన్పించనున్నాడు. సరైనోడులో ఓ పాట ద్వారా సైనికుడిగా కన్పించిన అల్లు అర్జున్‌ ఈ చిత్రంలో మరింత ఆకట్టుకుంటాడని తెలుస్తోంది.

na peru surya

Related Images: