బాబీ దర్శకత్వంలో వెంకీ, చైతూ మల్టీస్టారర్..!

బాబీ దర్శకత్వంలో వెంకీ, చైతూ మల్టీస్టారర్..!

‘బలుపు, జై లవ కుశ’ చిత్రాలతో హిట్ కొట్టిన డైరెక్టర్ బాబీ, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ని ‘సర్థార్ గబ్బర్‌సింగ్‌’గా చూపించడంలో విజయం సాధించలేకపోయారు. అయితే ఎన్టీఆర్‌ని మూడు పాత్రల్లో అద్భుతంగా డైరెక్ట్ చేసి శెభాష్ అనిపించుకున్నారు బాబీ. అంత పెద్ద హిట్ తర్వాత బాబీ ఇక వరుసపెట్టి సినిమాలు చేస్తారని అంతా భావించారు. అయితే ఇంతవరకు అతని తదుపరి ప్రాజెక్ట్ విషయం ఏమిటనేది వెల్లడవ్వలేదు.

అయితే టాలీవుడ్‌లో బాబీ ఓ సినిమా చేస్తున్నాడంటూ తాజాగా వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ మధ్య వెంకటేష్, నాగచైతన్య కలిసి ఓ చిత్రం చేయబోతున్నారని, అది ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్ర దర్శకుడు కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ఉండబోతుందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది కానీ, డైరెక్టర్ మాత్రం కల్యాణ్‌కృష్ణ కాదని, అతని స్థానంలోకి బాబీ వచ్చాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నాగచైతన్య రెండు చిత్రాలతో బిజీగా ఉంటే, తేజ దర్శకత్వంలో వెంకీ ‘ఆట నాదే వేట నాదే’ అంటూ రెడీ అవుతున్నాడు. ఈ చిత్రాల పూర్తయిన తర్వాత వీరి కాంబినేషన్‌లో చిత్రం తెరకెక్కనుందట. అయితే ఈ కాంబినేషన్ గురించి అఫీషియల్‌గా మాత్రం ఎటువంటి వార్తలు రాలేదు.

Related Images: