బాహుబలి రికార్డు ను బ్రేక్ చేసిన కళ్యాణ్ రామ్…

బాహుబలి రికార్డు ను బ్రేక్ చేసిన కళ్యాణ్ రామ్…

తెలుగు చిత్ర పరిశ్రమ ను ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం బాహుబలి. దర్శక ధీరుడు రాజమౌళి సృష్టించిన అద్భుతం దృశ్య కావ్యం. ఈ మూవీ ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేసిందో , ఎంత కలెక్ట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి ఈ మూవీ ని బ్రేక్ చేసింది కళ్యాణ్ రామ్ చిత్రం.

నందమూరి కళ్యాణ్ రామ్, తమన్నా జంటగా జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన “నా నువ్వే” సినిమా ధియేటిరికల్ ట్రైలర్ ను బుధవారం చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. లవ్ అండ్ ఏమోషనల్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. ఇక ఈ ట్రైలర్ విడుదలైన 24 గంటలు గడిచే లోపే యూ ట్యూబ్ లోనే ఏకంగా 7 మిలియన్స్ క్లిక్స్ ను దాటిపోవడం అందర్నీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఇది ‘నాన్ బాహుబలి’ రికార్డు అని తెలుస్తుంది. మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోల సినిమాల ధియేటిరికల్ ట్రైలర్స్ విడుదలయ్యాయి గానీ, ఏది కూడా ఈ స్థాయి రికార్డు క్లిక్స్ ను సొంతం చేసుకోలేదు. కానీ “నా నువ్వే” మాత్రం ఏకంగా 7 మిలియన్ క్లిక్స్ ను అందుకోవడం ఫై అందరి షాక్ అవుతున్నారు.

Related Images: